SBI Loan Offers
SBI Loan Offers : SBI సూపర్ ఆఫర్లు . రూ.లక్షకు రూ .1500 ఈఎంఐ . కార్ , గోల్డ్ , పర్సనల్ లోన్స్ కు వర్తింపు .
Loan Offers లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే హ్కు శుభవార్త. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.
అలాగే పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. ఈ తరహా రుణాలపై కూడా కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. జీరో ప్రాసెసింగ్ చార్జీల బెనిఫిట్ ఉంది. పర్సనల్ లోన్‌పై ఈఎంఐ రూ.లక్షకు రూ. 1880 నుంచి ప్రారంభం అవుతోంది. ఇక గోల్డ్ లోన్ విషయానికి వస్తే.. ఈ రుణాలపై రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 3145గా ఉంది.
బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా రుణం కోసం అప్లై చేయొచ్చు. దీని కోసం యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ హోమ్ లోన్ తీసుకునే వారికి కూడా ఆఫర్లు అందిస్తోంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కల్పిస్తోంది. నో హిడెన్ చార్జీలు ప్రయోజనం ఉంది. వడ్డీ రేటు కూడా 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అయితే తక్కువ వడ్డీ పడుతుంది. వెహికల్ లోన్ అయితే వడ్డీ రేటు 8.1 శాతం నుంచి ఆరంభం అవుతోంది. ఎడ్యుకేషన్ లోన్స్ అయితే వడ్డీ రేటు 8 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. లోన్ పొందాలని భావించే వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.
0 Response to "SBI Loan Offers "
Post a Comment