Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pollution - Free Diwali

 Pollution - Free Diwali : పర్యావరణహితంగా దీపావళి . ఈ పద్ధతుల్లో చేసుకుంటే అందరికీ మంచిది.

Pollution - Free Diwali

Pollution-Free Diwali: దీపాల పండుగ దీపావళి (Diwali 2022) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు రావాలని ఆకాంక్షించి జరుపుకునే ఈ పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణహితంగా 'గ్రీన్ దీపావళి (Green Diwali)'ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ లైట్స్ ఫెస్టివల్‌తో ఇతరులతో పాటు మీ జీవితాల్లో ఎలా వెలుగులు నింపుకోవచ్చు? అనే విషయాలు తెలుసుకుందాం.

గ్రీన్ క్రాకర్స్

దీపావళి నాడు పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్ కాకుండా వాటి స్థానంలో గ్రీన్ క్రాకర్లను కాల్చాలి. మార్కెట్‌లో ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల పర్యావరణానికి కాలుష్యం అతి తక్కువ స్థాయిలో జరుగుతుంది. మనుషులకు ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే ఈ గ్రీన్ క్రాకర్స్ తయారీలో హానికారకమైన రసాయనాలు పొటాషియం నైట్రేట్, కార్బన్, అల్యూమినియం వినియోగించరు. సీఎస్ఐఆర్ (CSIR) సంస్థ ఈ గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేస్తోంది. వీటిపై గ్రీన్ కలర్ లోగో వేయడంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తారు. లైసెన్సెడ్ సెల్లర్స్ నుంచి ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల శద్ద కాలుష్యం (Pollution) కూడా తక్కువగానే ఉంటుంది.

ప్లాస్టిక్‌ను పక్కనబెట్టండి

పర్యావరణానికి ప్రమాదం కలిగించే నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని దీపావళి రోజున అసలు వాడకండి. దీనికి ప్రత్యామ్నాయాలను వాడాలి. దీపావళి సందర్భంగా ఇచ్చే గిఫ్టులను ప్లాస్టిక్‌లో ప్యాక్ చేయడానికి బదులు పాత చీర లేదా ఫ్యాన్సీ క్లాత్‌తో ప్యాక్ చేసి డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయవచ్చు. అలా మీరు ఇతరులకు వినూత్నంగా దీపావళి విషెస్ చెప్పవచ్చు. పెయింటెడ్ న్యూస్ పేపర్స్‌లోనూ గిఫ్ట్స్ ప్యాక్ చేసి ఇవ్వవచ్చు.

మట్టి దీపాలు

ఇంటిని ప్లాస్టిక్ దీపాలు, ఎల్ఈడీ (LED) లైట్లు, కొవ్వొత్తులతో కాకుండా పర్యావరణహితంగా తయారు చేసిన మట్టి ప్రమిదల దీపాలతో అలంకరించుకోండి. మట్టి ప్రమిదల్లో నూనె పోసి వాటి ద్వారా వచ్చే వెలుగుతో మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

పేదవారి జీవితాల్లో వెలుగులు నింపండి

దీపావళి పండుగను క్రాకర్స్ కాల్చి సంతోషంగా జరుపుకోవడం మనం చూస్తుంటాం. అలా చేయడంతో పాటు దీపావళి పండుగ నాడు పలువురి జీవితాల్లో నిజమైన వెలుగు నింపేందుకు మీ వంతు ప్రయత్నం చేయవచ్చు. ఈ పర్వదినాన అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడున్న వారికి స్వీట్లు, దుస్తులు పంపిణీ చేస్తే వారి ముఖాల్లో నవ్వులు తీసుకురావచ్చు. అలా వారికి దీపావళి పండుగను గుర్తుండిపోయేలా చేయవచ్చు. ఈ దానంతో మీతో పాటు వారు కూడా సంతోషంగా ఉంటారు.

సహజ సిద్ధమైన రంగులను వాడండి

దీపావళి అలంకరణలో భాగమైన రంగోలిలో సహజసిద్దమైన రంగులను వాడటం మంచిది. దాల్చిన చెక్క, పసుపు, లవంగం, బియ్యం పిండి, పూలు వంటి నేచురల్ ఇన్‌గ్రేడియంట్స్‌తో తయారు చేసిన రంగులను ఉపయోగించాలి. వీటి వల్ల పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pollution - Free Diwali "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0