Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Solar eclipse :

 Solar eclipse : సూర్యగ్రహణం రోజు గర్భిణీలు చేయకూడని పనులు గురించి వివరణ.

Solar eclipse :

సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది అశుభకరమైందిగా పరిగణిస్తారు. అందువల్ల సూర్యగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించారు.

సూర్యగ్రహణం ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సూర్యగ్రహణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని చెప్తుంటారు. ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుందని అంటుంటారు. సూర్యగ్రహణం సంభవించే సమయంలో అనేక అలలు ఉద్భవిస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరమని చెబుతుంటారు. ఈ హానికరమైన తరంగాలు పుట్టబోయే బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతుంటారు.

గ్రహణ సమయంలో తలెత్తే ప్రతికూలతను నివారించడానికి, గర్భిణీ స్త్రీలుగ్రహణం సమయంలో ఇంటిలోనే ఉండాలి. అంతేకాకుండా.. పదునైన వస్తువులను ఉపయోగిస్తే.. ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుంది. గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఏమీ తినకూడదు. అంతేకాకుండా మహిళలు బయటకు వెళ్లకూడదు. ఏ పని చేయకూడదు. పడుకోకూడదు కూడా.

ఈసారి దీపావళి పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Solar eclipse :"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0