Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Offer

 SBI Offer : SBI నుంచి మంచి ఆఫర్ . 2023 జనవరి 31 వరకు

SBI Offer

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ ఆఫర్స్ ప్రకటించింది. వడ్డీ రేటులో భారీగా తగ్గింపు ప్రకటించింది.

అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మినహాయించింది. ఎస్‌బీఐ కస్టమర్లు 2023 జనవరి 31 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఎస్‌బీఐ ఇప్పటి వరకు రూ.6 లక్షల కోట్లకు పైగా గృహ రుణాలు ఇచ్చింది. తాము ఈ మార్క్ దాటినట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. 2021 జనవరిలో ఎస్‌బీఐ రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. 19 నెలల్లో మరో రూ.1 లక్ష కోట్ల గృహ రుణాలు మంజూలు చేసింది. ఏకంగా రూ.6 లక్షల కోట్ల మార్క్ దాటింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ హోమ్ లోన్ ఆఫర్స్ కూడా ప్రకటించింది.

ప్రస్తుతం ఎస్‌బీఐలో గృహ రుణాలు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కస్టమర్ల క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేటు ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్ డిస్కౌంట్ ప్రకటించింది ఎస్బీఐ. 2023 జనవరి 31 వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పైనా ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఎస్‌బీఐ దగ్గర 28 లక్షల హోమ్ లోన్ కస్టమర్లు ఉన్నారని ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. కొత్తగా రుణాలు తీసుకునేవారికి, లోన్ టేకోవర్లకు 8.40 శాతం నుంచి, టాప్ అప్ లోన్లకు 8.80 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతాయని మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ చౌదరీ తెలిపారు.

హోమ్ లోన్లపై 0.25 శాతం, టాప్ అప్ లోన్లపై 0.15 శాతం, ప్రాపర్టీపై తీసుకునే రుణాలపై 0.30 శాతం చొప్పున తగ్గింపు ప్రకటించింది. ఇక హోమ్ లోన్‌కు అప్లై చేస్తే వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఎస్‌బీఐలో 2023 జనవరి 31 వరకు హోమ్ లోన్ తీసుకునేవారు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్లిన అవసరం లేదు. ఎస్‌బీఐలో రుణాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

SBI హోమ్ లోన్‌కు అప్లై చేయు విధానం

  • Step 1- యోనో ఎస్‌బీఐ యాప్ ఓపెన్ చేయాలి.
  • Step 2- టాప్ లెఫ్ట్ కార్నర్‌లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి.
  • Step 3- లోన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
  • Step 4- హోమ్ లోన్ పైన క్లిక్ చేయాలి.
  • Step 5- పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • Step 6- ఆదాయ మార్గాల వివరాలు తెలపాలి.
  • Step 7- నెలవారీ ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి.
  • Step 8- ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • Step 9- మీకు ఎంత వరకు లోన్ వస్తుందో వివరాలు తెలుస్తాయి.
  • Step 10- మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీకు ఎస్‌బీఐ ఎగ్జిక్యూటీవ్ నుంచి కాల్ వస్తుంది. మిగతా లోన్ ప్రాసెస్ వివరిస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Offer"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0