Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Those who visit this temple should never look back after visiting it!

 ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Those who visit this temple should never look back after visiting it!

'శనయే క్రమతి సః' నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి 'మందుడు' అంటారు. శని త్రయోదశి సందర్భంగా 'దోషాలు పోగొట్టి యోగాన్ని అందించే' శనీశ్వరుడి ఆలయం గురించి ప్రత్యేక కథనం

శనిని భయంతో కాదు భక్తితో పూజించాలి

నవగ్రహాలకు అధిపతి శనీశ్వరుడు. ఆయన పేరు చెప్తేనే భయపడతారందరూ. కానీ శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిస్తే  శుభాలనొసగుతాడని పురాణాలు చెబుతున్నాయి. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండడం అరుదు. మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగురాష్ట్రాల విషయానికొస్తే తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుడికి ప్రత్యేకదేవాలయం ఉంది.కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది మందేశ్వర(శనీశ్వర)స్వామి దేవాలయం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడట. శని త్రయోదశి, అమావాస్య రోజు పూజలు చేయించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. శనిదోష నివారణకు ఇక్కడ కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తారు. కోర్టుకేసులు, రుణబాధలు కూడా ఈ దేవాలయ దర్శనంతో తీరిపోతాయని నమ్మకం.

ప్రచారంలో ఉన్న కథ

మందపల్లి అప్పట్లో పెద్ద అడవి. ఇక్కడ కైటభుడనే రాక్షసుడు తనకుమారులైన అశ్వర్థుడు, పిప్పలుడుతో కలసి ఉండేవాడు. అడవిలోకి తపస్సు చేసేందుకు వచ్చే మునులను మారురూపంలో తిరుగుతూ చంపితినేవారు ఈ రాక్షసులు. ఓసారి అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతంలో సంచరించినప్పుడు..రాక్షసుల గురించి చెప్పిన కొందరు మునులు తమను కాపాడమని వేడుకున్నారు. అదే సమయంలో గోదావరి తీరంలో తపస్సు చేస్తున్న శనీశ్వరుడి దగ్గరకు తీసుకెళ్లారట అగస్త్య మహర్షి.  తాను శివుడి గురించి తపస్సు చేస్తున్నానని..తమస్సు వచ్చిన శక్తితోనే వారిని సంహరించగలనంటాడు శని. అప్పుడు ఆ మునులుంతా కలసి తమ తప:శక్తిని శనీశ్వరుడికి ధారపోయడానికి అంగీకరిస్తాడు. అప్పుడు శనీశ్వరుడు కూడా మారువేషయంలో ఆ రాక్షసులను వధించాడు.  అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు  మందపల్లిలో ఒక లింగాన్ని ప్రతిష్టించి దానికి సోమేశ్వరుడని పేరు పెట్టాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల శనిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 

వెనక్కు తిరిగి చూడకూడదు

శత్రుబాధ రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, అమావాస్య రోజు ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడి పూజలో మిగిలిన వస్తువులు ఇంటికి తీసుకెళ్లకూడదు. అదే విధంగా ఆలయం బయటకు వెళుతూ వెనక్కు తిరిగి చూడకూడదు. అలా చూస్తే శనిదోషం మళ్లీ చుట్టుకుంటుందని చెబుతారు. 



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Those who visit this temple should never look back after visiting it!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0