Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPI payments : Did you make a UPI payment to someone else by mistake .. try this for recovery .

 UPI payments : పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ పేమెంట్ చేశారా .. రికవరీ కోసం ఇలా ప్రయత్నించండి .

UPI payments : Did you make a UPI payment to someone else by mistake .. try this for recovery .

యూపీఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) (UPI) విధానం వచ్చాక డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్లు సౌకర్యవంతంగా, సులభతరంగా మారిపోయాయి. నూతన టెక్నాలజీ తోడ్పాటుతో డిజిటల్ పేమెంట్ల ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది.

మరీ ముఖ్యంగా కరోనా తర్వాత యూపీఐ పేమెంట్లు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా భయాలు తొలగిపోయిన తర్వాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. డిజిటల్ వాలెట్స్, ఎన్‌టీఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్, యూపీఐ, పేటీఎం, గూగుల్ పే, భిమ్ యాప్, ఇతర అప్లికేషన్ల రూపేణ ఇదివరకెప్పుడూ లేనంతగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సవాళ్లు చాలా వరకు సమసిపోయాయి. చీటికిమాటికి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొన్నిసార్లు పొరపాటున వేరే వ్యక్తులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ అనుభవాన్ని చవిచూసినవారు కూడా ఉన్నారు. తప్పుగా వేరే యూపీఐ అడ్రస్‌ను ఎంటర్ చేయడంతో ఈ పొరపాటు జరుగుతుంది. కొన్నిసార్లు బ్యాంకు మోసాల రూపంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఆ డబ్బుని రికవరీ చేసుకోవడం ఒకింత కష్టమనే చెప్పాలి. కానీ ప్రయత్నించి చూస్తే తప్పేమీ లేదు. అదృష్టం బావుంటే రివకరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధానాలేవో మీరు కూడా తెలుసుకోండి.

సపోర్ట్ సెక్షన్‌ కాంటాక్ట్.

ఒకవేళ తప్పుగా వేరే యూపీఐ అడ్రస్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే.. మొదటగా మీరు వినియోగిస్తున్న యూపీఐ యాప్ 'సపోర్ట్ సెక్షన్‌' దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు కస్టమర్లకు సహకరించేందుకు ప్రతి యూపీఐ పేమెంట్ సంస్థకూ ఒక సొంత వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లకు సహకారం అందిస్తుంటారు. కాబట్టి వీలైన మార్గాలను వాళ్లు వెల్లడిస్తారు.

మీ బ్యాంక్‌ని సంప్రదించండి.

తప్పుగా వేరే యూపీఐ అడ్రస్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే తక్షణమే మెసేజులను స్ర్కీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత మీ బ్యాంకును ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి వివరాలు వెల్లడించండి. వీలైనంత త్వరగా మీ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి పేమెంట్ వివరాలను తెలియజేయండి. డబ్బులు ఎవరికి వెళ్లాయో చెప్పింది. బ్యాంక్ కస్టమర్ల కేర్ డిపార్ట్‌మెంట్‌కు వివరాలను వెల్లడించింది. ఒకవేళ యూపీఐ ఐడీ ఉంటే పేమెంట్ జరిగినట్టు నిర్ధారిస్తారు. ఒకవేళ ఎలాంటి యూపీఐ ఐడీ లేకుంటే వెంటనే మీ ఖాతాలోకి డబ్బును రీఎంబర్స్ చేస్తారు.

భిమ్ (BHIM) హెల్ప్‌లైన్ నంబర్‌.

తప్పుగా వేరే వ్యక్తికి డబ్బులు పంపించినప్పుడు కస్టమర్లు చేయగలిగే రెండవ అవకాశం భిమ్(BHIM) టోల్ ఫ్రీ నంబర్. 1800 1201740 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రతినిధికి పేమెంట్ వివరాలన్ని చెప్పాలి. వాస్తవానికి ఒకసారి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే మళ్లీ తిరిగొచ్చే అవకాశం ఉండదని భిమ్ ప్రతినిధులు తెలియజేస్తారు. కానీ డబ్బు రిసీవ్ చేసుకున్న వ్యక్తి రిటర్న్ చేసేందుకు సుముఖంగా ఉంటే ఇబ్బంది ఉండదని, విజ్ఞప్తి చేసి డబ్బు తిరిగి పొందొచ్చని సలహా ఇస్తారు. అయితే ఇందుకు ఎలాంటి గ్యారంటీ ఉండదని స్పష్టంగా తెలియజేస్తారు. కాగా వీపీఏ (వర్చువల్ పేమెంట్ అడ్రస్) ఆధారిత లావాదేవీల ద్వారా రిక్వెస్ట్ చేయవచ్చు.

చివరిగా ఎన్‌పీసీఐ- యూపీఐ డిస్ప్యూట్ రెడ్రెస్సెల్ మెకానిజమ్

పైన పేర్కొన్న విధానాల్లో డబ్బు రికవరీ కాకపోతే చివరిగా ఎన్‌పీసీఐ (NPCI)కి చెందిన యూపీఐ డిస్పూట్ రెడ్రెస్సెల్ మెకానిజమ్‌కి ఫిర్యాదు చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPI payments : Did you make a UPI payment to someone else by mistake .. try this for recovery ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0