Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp New Feature

 WhatsApp New Feature : వాట్సాప్ కొత్త ఫీచర్..ఉపయోగాలివే .

WhatsApp New Feature

WhatsApp New Feature : పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తరచుగా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ యాప్ ఇప్పటివరకు తన ఫ్లాట్‌ఫామ్‌లో మిస్సయిన కీలకమైన ఫీచర్లను కూడా తీసుకొస్తోంది.

అయితే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ క్యాప్షన్‌తో మీడియా ఫైల్స్ పంపించే ఫెసిలిటీని తీసుకొచ్చేందుకు సిద్ధమైందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. కాగా ఈ ఫీచర్ ఇప్పుడు బీటా టెస్టర్లకు విడుదలవుతోంది.

ప్రస్తుతం వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, గిఫ్స్‌, డాక్యుమెంట్స్‌ వంటి మీడియా ఫైల్స్ ఫార్వర్డ్ చేయడం చాలా ఈజీ. కాకపోతే టెక్స్ట్ గల మీడియా ఫైల్స్ సెండ్ చేయడం పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. ఒక టెక్స్ట్ ఉన్న మీడియా ఫైల్ ఫార్వర్డ్ చేస్తే.. కేవలం ఆ ఫైల్ ఒక్కటే సెండ్ అవుతుంది. అప్పుడు మిగిలిన టెక్స్ట్ మొత్తం టైప్ చేసి పంపించాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా వాట్సాప్ 'ఫార్వర్డ్ మీడియా విత్ ఎ క్యాప్షన్' ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు WABetaInfo కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. కాగా ఇప్పుడా ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ 2.22.23.15 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొందరికి అందుబాటులోకి వచ్చింది.

కొత్త ఫీచర్ ఉపయోగాలు

ఈ ఫీచర్ సాయంతో యూజర్లు మీడియా ఫైల్స్‌ను క్యాప్షన్ టెక్స్ట్‌తోనే సెండ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీడియా ఫైల్స్‌తో అటాచ్ అయి ఉన్న టెక్స్ట్ క్యాప్షన్‌ మొత్తం టైప్ చేయాల్సిన శ్రమ తప్పుతుంది. లేటెస్ట్ వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది లక్కీ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ ప్రస్తుతానికి రిలీజ్ అయింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రావచ్చని వాట్సాప్ ట్రాకర్ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను సైతం షేర్ చేసింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో ఫార్వర్డ్ మెసేజ్ ఇంటర్‌ఫేస్‌లో కొత్త మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్‌లో ఫార్వర్డ్ చేసే ఫొటో కింద క్యాప్షన్ కూడా కనిపిస్తోంది. ఈ క్యాప్షన్‌ను తొలగించేందుకు వీలుగా ఒక క్రాస్ మార్క్‌తో డిస్మిస్ ఐకాన్ కూడా కనిపించింది. మీ వాట్సాప్ అకౌంట్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి క్యాప్షన్‌తో ఉన్న ఫొటోను ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీకు మెసేజ్ బాక్స్ కింది భాగంలో క్యాప్షన్ కూడా కనిపిస్తే అప్పుడు ఆ ఫీచర్ వచ్చినట్లు అర్థం.

మరిన్ని ఫీచర్స్

వాట్సాప్ ఈ ఏడాది మెసేజ్ రియాక్షన్లు, చాట్ లిస్టులో స్టేటస్ అప్‌డేట్స్, స్టేటస్ అప్‌డేట్స్‌కి క్విక్ రియాక్షన్స్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. త్వరలో మెసేజ్ ఎడిట్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, కమ్యూనిటీస్, పోల్స్, అవతార్స్ లాంటి ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది. వాట్సాప్ ఇమేజ్ బ్లర్ టూల్‌ను సైతం తీసుకొస్తున్నట్లు WABetaInfo రిపోర్టు పేర్కొంది. ఈ ఫీచర్‌తో పంపించే ఇమేజెస్‌లోని వివరాలు బ్లర్ చేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp New Feature"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0