Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Card Photo Update

 Aadhaar Card Photo Update : ఆధార్ కార్డ్ ఫోటో నచ్చలేదా ? అందంగా మార్చుకొనే విధానం.

Aadhaar Card Photo Update

Aadhaar Card Photo Updae: భారతదేశ పౌరుల గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఇది అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు. బ్యాంకు ఖాతాలు తెరవవానికి, లావాదేవీలు కొనసాగించడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, కొలువుల్లో చేరడానికి ఇలా.

చాలా రకాల పనుల కోసం ఆధార్‌ కార్డును తప్పని సరిగా అడుగుతున్నారు. ఆధార్‌ కార్డ్‌ లేని మనిషిని విచిత్రంగా చూస్తున్న రోజులివి. మీకు ఆధార్ కార్డ్ లేకపోయినా, రాకపోయినా ప్రభుత్వ పథకాలు అందవు. ఆధార్ కార్డ్‌లో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇందులో, వేలిముద్రల (బయోమెట్రిక్) వివరాలు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా వంటి వినియోగదారులకు సంబంధించిన సమాచారం ఉంటుంది.

ఆధార్ కార్డ్‌లో వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవడానికి లేదా తప్పులు సరి చేసుకోవడానికి లేదా అప్‌డేషన్‌ కోసం ఆధార్‌ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే వివరాలు మార్చుకునే సదుపాయాన్ని ఉడాయ్‌ (Unique Identification Authority of India - UIDAI) కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. అయితే, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్ చేయడం కుదరదు. ఫోటో, బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవడానికి (అప్‌డేట్ చేయడానికి) మీరు తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం, నేరుగా ఆధార్‌ సేవ కేంద్రానికి వెళ్లవచ్చు లేదా, ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిర్దేశిత ఆధార్‌ సేవ కేంద్రంలో మీకు వీలైన సమయం కోసం ఒక అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఉన్న మీ ఫోటో లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బాగోలేకపోతే, లేదా ఆ ఫోటోలు పాతవి అయితే వాటిని మార్చుకోవచ్చు. ఈ కింద సూచించిన సులభ మార్గంలో ఆధార్‌ కార్డ్‌లోని ఫోటోను మార్చవచ్చు.

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చడానికి సులభ మార్గం:
ముందుగా mAadhaar యాప్ నుంచి ఫోటో అప్‌డేషన్‌ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీరు ఈ ఫారాన్ని ఆధార్ సేవ కేంద్రం నుంచి కూడా పొందవచ్చు.
ఆ ఫారంలో అడిగి వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి. అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి.
ఫారం నింపిన తర్వాత, మీరు ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి దానిని సమర్పించాలి. ఇప్పుడు, ఫొటో అప్‌డేషన్‌ పని ప్రారంభమవుతుంది.
ఆధార్‌ సేవ కేంద్రంలోని సిబ్బంది మీ నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్) తీసుకుంటారు.
అక్కడే ఉన్న కెమెరా ద్వారా మీ ఫోటో కూడా తీసుకుంటారు. ఇదే ఫొటోను ఆధార్‌ కార్డ్‌లో అప్‌డేట్‌ చేస్తారు.
ఆధార్‌ కార్డ్‌ ఫొటోలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటారో, దానికి తగ్గట్లుగా ముందే సిద్ధమై వెళ్లండం ఉత్తమం.
ఇప్పుడు మీరు ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఆధార్‌ సేవ కేంద్రంలో రుసుము చెల్లించాలి.

ఈ తతంగం ముగిసిన తర్వాత మీకు రసీదు ఇస్తారు. దాని మీద URN నంబర్ ఉంటుంది. దాని సహాయంతో, మీరు మీ ఫోటో అప్‌డేట్ ప్రక్రియను ట్రాక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత, UIDAI నుంచి ఫోటో అప్‌డేట్ SMS వస్తుంది. మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు ఆ SMS వస్తుంది. దీని తర్వాత, మీరు ఆధార్ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆధార్ కార్డ్‌లో నవీకరించిన ఫోటోను చూసుకోవచ్చు, దానిని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి?
UIDAI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో ఫోటోను నవీకరించడానికి భారతదేశ పౌరులు రూ. 100 చెల్లించాలి. ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఇతర ఏ గుర్తింపు పత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్‌లో ఫోటో ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్‌డేట్ చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా మనమే అప్‌డేట్‌ చేసుకోవడం కుదరదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar Card Photo Update"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0