Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you taking a credit card that is being banked.. You can know these things first.

 Credit Cards  బ్యాంకులిస్తున్నాయని క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా .. ముందు ఈ విషయాలు తెలుసుకోగలరు.

Are you taking a credit card that is being banked.. You can know these things first.

Credit Cards  రోజువారీ అవసరాలు, బెనిఫిట్లను పరిగణనలోకి తీసుకున్నాకే క్రెడిట్ కార్డులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Credit Cards కొవిడ్-19 మహమ్మారి తర్వాత వినియోగదారుల కొనుగోళ్లు పెరిగాయి.

తమ అవసరాలను బట్టి లోన్లు తీసుకోవడంతోపాటు క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక కొత్త క్రెడిట్ కార్డులు తీసుకునే వారిని ఆకట్టుకోవడానికి క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఫెస్టివ్ సీజన్‌లో స్పెషలాఫర్లు ఇచ్చిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. ఇయర్ ముగింపు దశలో మళ్లీ అవే ఆఫర్లు ముందుకు తెస్తున్నాయి.

వస్తువుల కొనుగోళ్లతోపాటు జీవన శైలి ఖర్చుల కోసం కొందరు క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు క్రెడిట్ కార్డు తీసుకునే ప్రతి ఒక్కరూ ఆ కార్డు తమ కుటుంబ అవసరాలకు సరిపడుతుందా? లేదా? అన్న సంగతి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. అటువంటప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్ జరిపితే డిస్కౌంట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులను గుర్తించి, వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి.

డిస్కౌంట్లు, ఆఫర్ల ప్రలోభాలకు గురి కావొద్దు

క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కొత్తగా జారీ చేస్తున్న క్రెడిట్ కార్డులు డిస్కౌంట్ల పేరిట వస్తువుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా.. అవి ఎంత వరకు ఉపయోగం అన్న సంగతి చెక్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ డెలివరీ సంస్థలు, కొన్ని బ్రాండ్లతో క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుని రాయితీలు అందిస్తాయి. ఈ బెనిఫిట్లతో ఎప్పుడో ఉపయోగం ఉంటుంది.

క్రెడిట్ కార్డు ఉచిత సేవలపై ఇలా

ఇక ప్రతి క్రెడిట్ కార్డు జారీ సంస్థ తాము ఉచిత సేవలు అందిస్తున్నాం అని అంటుంటాయి. కానీ.. క్రెడిట్ కార్డులకు వార్షిక ఫీజు మినహాయింపు కోసం కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రతి ఏటా కొంత నిర్ధిష్ట మొత్తం కొనుగోళ్లు జరిపితే క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు మాఫీ అవుతుంది. మరి కొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వార్షిక ఫీజు వసూలు చేస్తాయి. తదనుగుణంగా కొన్ని బెనిఫిట్లు కల్పిస్తాయి. ఇలా సదరు క్రెడిట్ కార్డులతో లభించే ప్రయోజనాల్లో అత్యధికం మనకు ఉపయోగపడనివే ఉంటాయి. హోటల్లో బస చేస్తే రాయితీ, గోల్ఫ్ కోర్సులు, ఎయిర్ పోర్టు లాంజీల్లో ఎంట్రీ వంటి ఉచిత సౌకర్యాలు కల్పిస్తాయి. కానీ తరుచుగా విమాన ప్రయాణాలు చేసే వారికి ఈ వసతులతో బెనిఫిట్లు లభిస్తాయి.

ఇవీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుతో బెనిఫిట్లు

ప్రస్తుతం పలు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. కొన్ని బ్రాండ్లతో కలిపి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. ఆయా బ్రాండ్ వస్తువులతో అనుబంధం ఉంటేనే.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో బెనిఫిట్లు పొందొచ్చు. అధిక రివార్డులు, రాయితీలు పొందొచ్చు.. అలా కానీ పక్షంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగం ఉండక పోవచ్చు. క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థలు సంబంధిత వ్యక్తుల నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర తదితర అంశాలను పరిశీలించాకే క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి. ఇప్పటి వరకు ఎటువంటి లోన్ తీసుకోకున్నా.. క్రెడిట్ కార్డు లేకున్నా.. ప్రాథమిక ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి.

లోన్ తీసుకుంటే ప్రీమియం బెనిఫిట్స్ కార్డు

ఇప్పటికే మీరు రుణాలు తీసుకుని, గుడ్ పేమెంట్స్ చరిత్ర గల వారికి ప్రీమియం ప్రయోజనాలు గల క్రెడిట్ కార్డు వస్తుంది. సిబిల్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉంటే.. క్రెడిట్ కార్డు పొందడానికి ఇబ్బందులేం ఉండవు. కానీ, స్థిరమైన ఇన్ కం లేని వారు కాసింత జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవడంపై ఒక నిర్ణయానికి రావాలి.. అటువంటి వారు సాధారణ క్రెడిట్ కార్డు తీసుకోవడం కంటే ఫిక్స్డ్‌డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం బెటర్.

క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తేనే బెనిఫిట్లు

క్రెడిట్ కార్డు తీసుకోగానే సరిపోదు. దాని వినియోగానికి గల రూల్స్ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. స్టేట్ మెంట్ బిల్లింగ్ తేదీలపై అవగాహన కలిగి ఉండాలి. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తేనే బెనిఫిట్లు ఉంటాయి. కనీస బిల్లు చెల్లింపుతోనూ, బిల్లు బకాయి పడటం వల్లనూ అధిక వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

క్రెడిట్ కార్డుతో క్యాష్ విత్ డ్రా చేయొద్దు

ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డును వినియోగించి క్యాష్ విత్ డ్రాయల్ చేయరాదు. అలా చేస్తే వార్షిక వడ్డీ 36-40 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే మీరొక క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారనుకోండి.. తప్సనిసరి అవసరమైతే తప్ప మరొక క్రెడిట్ కార్డు తీసుకోవద్దు. నిత్యం ఇస్తున్నారని అదే పనిగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం మంచి పరిణామం కాదని నిపుణులు సూచిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you taking a credit card that is being banked.. You can know these things first."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0