Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Electric vehicles for government employees. AP government signs agreement with electric bike companies.

 AP Govt : ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు . ఎలక్ట్రిక్ బైక్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం .

Electric vehicles for government employees.  AP government signs agreement with electric bike companies.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ-స్కూటర్‌)లను అందించేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ వాహనాలను అందించనుంది.

ఇందుకోసం ఎలక్ట్రిక్ బైక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే టార్గెట్‌గా ప్రభుత్వం ఈ-స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. అతి త్వరలోనే ఈ పథకం సాకారం కానుంది.

అంతేగాకుండా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆప్కాబ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఆర్థిక సాయం చేస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఓలా, హీరో, బిగాస్, కైనటిక్, ఆథర్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఏడాదిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష వాహనాలను అందించాలని ప్లాన్ చేస్తోంది.

ఇందుకు అవసరమైన ఒప్పందాలను చేసుకుంది ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌). ఈ-స్కూటర్లు అందుబాటులోకి వస్తే.. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే 3 గంటల పాటు చార్జింగ్‌ పెడితే చాలు.. రోజంతా ఈ-స్కూటర్‌ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది.

ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Electric vehicles for government employees. AP government signs agreement with electric bike companies."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0