Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

December 1st Rules

 December 1st Rules : డిసెంబర్ 1 న వచ్చే మార్పులు . ఈ పని మాత్రం నవంబర్ 30 లోగా పూర్తి చేసుకోగలరు.

December 1st Rules

December 1st Rules: ప్రతి నెల కొన్ని విషయాలపై మనం తప్పక దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి వల్ల వచ్చే మార్పులు మన జేబుపై భారాన్ని మోపవచ్చు.

అలా డిసెంబర్ మాసంలో వచ్చే కీలక మార్పులు మన దైనందిన జీవితంపై ఎలాంటి మార్పులు చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది.

గ్యాస్ ధరలు

ప్రతి నెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఇదే క్రమంలో వాటి రేట్లను పెంచటం లేదా తగ్గించటంపై కీలక ప్రకటన చేస్తాయి. దీనికోసం ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సారి డిసెంబర్ మాసంలో గ్యాస్ ధరలు తగ్గి చౌకగా మారతాయని చాలా మంది ఆశిస్తున్నారు. వీటికి తోడు LPG-CNG, PNG ధరలను సైతం కంపెనీలు మార్చే అవకాశం ఉంది. చాలా నెలలుగా గృహ వినియోగ సిలిండర్ల రేట్లు తగ్గకపోటంతో చాలా మంది ఈ సారి ఆశగా ఊరట కోసం ఎదురుచూస్తున్నారు.

ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్.

డిసెంబర్ నుంచి ATM క్యాష్ విత్‌డ్రా చేసే విధానం కూడా మారవచ్చని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిసెంబర్ నెలలో ATMల నుంచి నగదు విత్ డ్రా ప్రక్రియలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం ఏటీఎంలో కార్డు పెట్టగానే కస్టమర్ మెుబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఏటీఎం స్కీన్ లో ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. దీనివల్ల ప్రస్తుతం కొనసాగుతున్న ఏటీఎం మోసాలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

రైలు షెడ్యూల్ మార్పు.

డిసెంబర్ మాసంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో చలివల్ల ఏర్పడే పొగమంచు పెరుగుతుంటుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. పొగమంచు దృష్ట్యా భారతీయ రైల్వే తన టైమ్ టేబుల్‌ను కూడా మార్చి కొత్త టైమ్ టేబుల్ ప్రకారం రైళ్లను నడపనుంది తెలుస్తోంది. ప్రయాణికులు ముందుగా రైళ్ల రాకపోకల్లో వచ్చిన మార్పులను గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.

13 రోజులు బ్యాంక్ బంద్.

డిసెంబర్ నెలలో రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు దాదాపు 13 రోజులు మూసివేయబడి ఉంటాయి. పండుగలతో పాటు ఆదివారాలు, అనేక రాష్ట్రాల్లో పండుగల వల్ల ఈ సెలవులు మారతాయి. ఈ సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనుల కోసం సెలవుల వివరాలు ముందుగా తెలుసుకోవటం ముఖ్యం.

నెలాఖరులోపు పూర్తి చేయాల్సిందే.

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి గడువు నవంబర్ 30, 2022గా ఉంది. ఈ క్రమంలో నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్ ను సీనియర్ పెన్షనర్లు సమర్పించాల్సి ఉంది. అలా చేయని పక్షంలో డిసెంబర్ 1 నుంచి పెన్షన్ పొందటంలో అసౌకర్యం ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది. లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించకపోతే పెన్షన్ కూడా నిలిపివేయబడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "December 1st Rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0