Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explain why the sky is blue.

 ఆకాశం నీలం రంగులో ఎందుకు ఉంటుంది వివరణ.

Explain why the sky is blue.

ఆకాశం నీలం రంగులో వుంటుందని మందరికీ తెలిసిందే...! అయితే, అలా ఎందుకు నీలం రంగులో వుంటుంది? కాంతి చెదరడవల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. గాలిలో అనేకమైన అణువులు అంటే మోలిక్యూల్స్, రేణువులు అంటే పార్టికిల్స్ వుంటాయి. ఉదాహరణకు ఆమ్లజని, నత్రజని అణువులు గాలిలో విస్తారంగా వుంటాయి. అలాగే దుమ్ము రేణువులు, నీటి ఆవిరి అణువులు కూడా...!! కాంతి కిరణాలు సూర్యుడి దగ్గర నుండి మన దగ్గరకు చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదురవుతుంది.

సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు వుంటాయనేది ఇంద్ర ధనుస్సు ద్వారా మనకు తెలిసిందే.

విచిత్రమైన విషయమేంటంటే ఏంటంటే ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి ఇంద్ర ధనుస్సులో తరంగ దైర్ఘ్యం తక్కువ వున్న ఊదా రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ వున్న ఎరుపు రెడ్ తక్కువ చెదురుతుంది. అది ప్రకృతి లక్షణం. సూర్యుడు ఆకాశంలో కిందకి వున్నప్పుడు అంటే ఉదయం, సాయంత్రం సూర్య కిరణాలు భూమి వాతావరణంలో ఎంతో దూరం ప్రయాణిస్తే తప్ప మన కంటిని చేరలేవు. కనుక కిరణాలలోని రంగులు విరజిమ్మబడటానికి అవకాశాలు ఎక్కువ. నీలి రంగు ఎక్కువగా అటూయిటూ చెదిరిపోతుంది.

కానీ, ఎరుపు తక్కువ చెదురుతుంది కాబట్టి తిన్నగా మన కంటిని చేరుకుంటుంది. అందుకనే సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. పల్లెటూళ్లలో గోధూళి వేళ గాలిలో బాగా దుమ్ము రేగుతుంది. అందుకే, గోధూళి వేళ ఆకాశం ఎర్రగా వుంటుంది. సూర్యుడు నడి నెత్తి మీద వున్నప్పుడు కిరణాలు మన వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల సాయంత్రం కంటే ఎక్కువ నీలి రంగు మన కంటిని చేరుతుంది. అందుకని మధ్యాహ్నం ఆకాశం నీలంగా కనిపిస్తుంది. కొండలు కూడా దూరం నుండి నీలి రంగులో కనిపిస్తాయి. అందుకే నీలగిరులు అంటాం.

చెట్లు దట్టంగా వున్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా వుంటే బూడిద రంగులో వుంటాయి. ఇవి దూరం నుండి నీలి రంగు గాలి పొరల గుండా కనిపిస్తాయి. అయితే, నిజానికి గాలికి రంగు వుండదుగా... రోదసి రంగు నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహాగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది, కనిపించదు. అది మన భ్రాంతి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explain why the sky is blue."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0