Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of whether to wear a ring with the figure of God.

 దేవుని బొమ్మ ఉన్న ఉంగరాన్ని పెట్టుకోవచ్చా వివరాలు.

Details of whether to wear a ring with the figure of God.

మనలో చాలామంది ఇష్టదైవాన్ని రూపుకట్టించుకొని కుడిచేతి ఉంగరం వేలికి తొడుక్కుంటారు . కుడిచేతికి దేవుని బొమ్మతో ఉంగరం ఉంటే అన్నం తినేప్పుడు ఎంగిలి అంటుకుంటుంది కదా ? అదేవిధంగా ఉంగరాన్ని మనం సర్వకాల సర్వావస్థల్లోనూ ధరించే ఉంటాము కదా ? మరి అలా ధరించవచ్చా ? దానివల్ల భగవంతునికి అపచారం కలుగుతుందేమోనని భావన. 

‘భావయామి  గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా’ అని భావన చేసిన అన్నమాచార్యులు ఆ శ్రీకృష్ణుని రమ్యమైన , భవ్యమైన పాద దర్శనాన్ని చేసుకోగలిగారు . యద్భావం తత్భవతి అన్నట్టు భావనతోనే మన అనుమానాలు సగం సత్యమై నిలుస్తుంటాయి . 

ఏ రాయైనా,  ఏ రాశి వారికి అని జ్యోతిష్యులు చెప్పేదాకా తెలియదు కనుక, తెలిసీ తెలియకుండా ఏరాయి పడితే ఆ రంగురాయిని ధరించవద్దని పెద్దల ఉవాచ కనుకా, ఈ బాధలన్నీ లేకుండా ఎంచక్కా దేవుని బొమ్మని చెక్కించుకొని ఉంగరం వెలికి తొడిగేసుకుని మురిసిపోయేవారు కొందరు. ఆ బంగారములోనో , వెండిలోనో తమ ఇష్ట దైవమునే పొదువుకుంటే , నిత్యం ఆస్వామి కరుణ తమతో ఉంటుందనే విశ్వాసం మరికొందరిది . 

అసలు ఎందుకు పెట్టుకోవాలి అని ఆలోచన చేయండి. ఆ ఉంగరం చుస్తే తప్పా, భగవంతుడు గుర్తుకు రారు అనుకునే వారు, భోజనం చేసేప్పుడు తీసేయండి. ఎందుకంటే, వారు ఆ ఉంగరం లో దేవుని చూస్తున్నారు. ఆయన పట్ల అపచారం అని భావించడం సహేతుకమే.

ఏదేమైనా , ముందే చెప్పుకున్నట్టు , మీ మనసులో భోజనం చేసేప్పుడు ఆయనకీ ఎంగిలి అంటుకుంటుంది అనిపించిందనుకోండి , తీసేయండి. భోజనం చేశాక మళ్ళీ పెట్టుకోండి . అదే స్వామికి ఇది నివేదన , ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను ఆనుకున్నారనుకోండి , చక్కగా వేలికి ఉంచుకొనే భోజనం చెయ్యండి . రత్నాంగుళీయకం ధరించినపుడు, ఈ అనుమానం రాదు. 

ఇక్కడ నాకు షిరిడీ సాయి బాబా వారి కథ ఒకటి గుర్తొస్తోంది . బాబా మసీదులో వెలిగించిన దీపాలకి నూనెకి బదులు నీళ్ళని వాడారు.  ఆయనకీ చముఱైనా నీరయినా ఒక్కటే . ఆయన అనుకుంటే ఎందులోఅయినా ఉంటారు . చరాచర సృష్టంతా తానె అయినప్పుడు ఏది నీరు , ఏది చమురు ? అలాగే ఏ అవస్థ భగవంతునిది ? ఏది కాదు ? సర్వకాల సర్వావస్థల యందూ , ఆ స్వామి మనలోనే ఉన్నారు .  దేహమేకదా దేవాలయం . 

అలాంటప్పుడు ఆ సనాతన దైవాన్ని వేలికి ధరించినా, ధరించకపోయినా లాభము , నష్టము లేవు . కాబట్టి అంతా  మన భావనలోనే ఉంది .  భావన చేయగలిగితే, పరమాత్మనే దర్శనం చేసుకోవచ్చు ! వేలికున్న ఉంగరానిదొక లెక్కా

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of whether to wear a ring with the figure of God."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0