Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Dhanurmasam

 Dhanurmasam 2022 : నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం , ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం. మార్గశిరమాసం గురించి వివరణ.

Dhanurmasam

Dhanurmasam 2022 : తెలుగు నెలల్లోని ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటంటే..ఈ నెలను మార్గ శీర్షం అని కూడా పిలుస్తారు.

శీర్షం అంటే అగ్రభాగం..మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది అని అర్థం. ఈ నెల 24 గురువారం నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది. ఈనెల లక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది. మరో విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి 'భగవద్గీత' బోధించినది ఈ నెలలోనే . సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం మొదలవుతుంది.

మార్గశిర మాసంలో ప్రత్యేకరోజులు

  • మార్గశిర శుద్ద పంచమి రోజు నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు
  • మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి
  • మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేస్తే అన్నీ శుభఫలితాలే
  • మార్గశిర అష్టమిని కాళభైరవాష్టమిగా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుందంటారు. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే మంచిదని చెబుతారు.
  • మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
  • వైకుంఠ ఏకాదశి రోజే గీతా జయంతి జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినం రోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించింది ఇదే రోజు
"గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:"
  • గీత అనే రెండక్షరములు సర్వసంగపరిత్యాగానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకలు. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాంటి పరమపావనమైన గీతన భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం వస్తుందని హిందువుల విశ్వాసం.
  • మార్గశిర ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు.
  • మార్గశిర శుద్ద త్రయోదశి రోజు హనుమంతుడి భక్తులు ఆంజనేయుడి వ్రతం ఆచరిస్తారు.
  • మార్గశిర శుద్ద పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం.
  • కార్తిక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు చాచి ఉంటాడట. అందకే మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మ రాజుకి నమస్కరిస్తే సంపూర్ణ ఆయుష్షు లభిస్తుందంటారు.
  • ఈ నెలలోనే ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కుటంబలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని విశ్వాసం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Dhanurmasam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0