Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO CEPTAM 10 Recruitment 2022

 DRDO భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌. 1061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు అర్హులు.

DRDO CEPTAM 10 Recruitment 2022

DRDO CEPTAM 10 Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌-10/ఎ&ఎ) అడ్మిన్ & అలైడ్ కేడర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 7 నుంచి ప్రారంభమైంది.

మొత్తం ఖాళీలు: 1061

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీవో): 33 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’ (ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 12 పోస్టులు

స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’(హిందీ టైపింగ్): 04 పోస్టులు

సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ 41 పోస్టులు

వెహికల్ ఆపరేటర్ ‘ఎ’: 145 పోస్టులు

ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఎ’: 18 పోస్టులు


ఫైర్‌మ్యాన్: 86 

పోస్టులుముఖ్య సమాచారం:

అర్హతలు: పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండి.. టైపింగ్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35400-రూ.112400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25500-రూ.81100, ఇతర పోస్టులకు రూ.19900- రూ.63200 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1 (సీబీటీ), టైర్-2 (నైపుణ్య, శారీరక దృఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభం :  07.11.2022

దరఖాస్తులకు చివరితేది: 07.12.2022

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO CEPTAM 10 Recruitment 2022 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0