Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of why Kartika lamps should be dropped in water.

 కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి వివరణ.

Explanation of why Kartika lamps should be dropped in water.

కార్తీకమాసం పరమపుణ్యమైన మాసం. ఈ నెలరోజులూ శివ కేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. భగవంతునికి ఇష్టమైన సమయంలో , భక్తులు భక్తితో నమస్కరించినా అనంత ఫలం దక్కుతుంది . సంవత్సరంలో ఏరోజు దీపం వెలిగించక పోయినా , కార్తీకమాసంలో దీపం వెలిగించడంవలన ఆ దోషం పోతుందని పెద్దలు అంటారు

కార్తీకపురాణంలో కార్తీకమాస విశిష్టత చాలా గొప్పగా వివరించారు . ఈ మాసంలో చేసే స్నానం , దీపారాధన , దీపదానం, ఉపవాస దీక్షల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ! కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడు. ఆయన కొడుకైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడు . అంతెందుకు, కుక్కకి కూడా కైవల్యాన్ని, కైలాసాన్ని ప్రసాదించగల మహత్యం ఈ మాసదీక్షకి ఉందని కార్తీక పురాణం తెలియజేస్తోంది.

ఈ నెలరోజులూ ఇంట్లో దీపాలు వెలిగించడం ఒకఎత్తయితే, శివాలయాల్లో లేదా విష్ణాలయంలో దీపాలు వెలిగించడం , చెరువులు, నదుల్లో దీపాలు వదలడం మరో ఎత్తు . కార్తీకమాసంలో ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటుంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. నింగిలోని తారకలన్నీ నెలకి దిగివచ్చాయేమో అనే అనుభూతి కలిగిస్తుంది . కన్నుల పండుగగొలిపే ఈ సంప్రదాయంలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం .

శివుడు పంచభూతేశ్వరుడు .

“నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం.

అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం.

శివమ్ శివమ్ భవ హరం హరం”

పంచభూతాలయిన ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమే సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రమయిన ‘న-మ-శి-వా-య’ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. అటువంటి ఈ జగత్తుకి పరమాత్మ ఈశ్వరుడు . పంచభూతస్వరూపుడు.

పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరంలో ఉన్న పరమాత్మ జ్యోతిస్వరూపుడు . ఈ జీవుడు పరమాత్మలో లయమయ్యే సమయంలో జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుకుంటుంది . ఆ జీవజ్యోతికి ప్రతిరూపమైన జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అనే అద్భుత క్రియ ఈ కార్తీకదీపాలని వదలడం .దీని ఆంతర్యం మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరునికి అంకితం చేయడమే. ఇదిలా ఉంచితే, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి కైలాసానికి చేరతారని శృతి వచనం . అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. ఒక్క తులసీదళానికి , చిన్న బిల్వదళానికి దోసెడు నీళ్ళకి సంతోషపడిపోయే పరమాత్మకు , మన ఆత్మజ్యోతినే కానుకగా అర్పిస్తే, యెంత ఆనందమో వర్ణించ సాధ్యమేనా ?

దానితోపాటుగా , విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో; శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఈ విధంగా దీపారాధన చేయడం అత్యంతఫలప్రదం .

చల్లని శీతాకాలపు చలికి వెచ్చని దీపపు వేడిని, చీకటి దుప్పటిని కప్పుకున్న లోకానికి యెర్రని జ్యోతుల వెలుగుని, ఆకలితో అలమటిస్తూ ఉన్నవారికి కమ్మని ప్రసాదాన్ని అందించి దాంతోపాటే ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందడం గొప్ప సంప్రదాయం కాక మరేమిటి. ఇది మన సనాతనధర్మంలో నిబిడీకృతమైఉన్న అద్భుతమేగా !

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of why Kartika lamps should be dropped in water."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0