Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Huge changes in PM Kisan before 13th phase. If you don't do this, the money will not go into the account, what to do.

 PM Kisan Update : 13 వ విడతకు ముందు పీఎం కిసాన్లో భారీ మార్పులు . ఇవి చేయకుంటే అకౌంట్ లో డబ్బులు పడవు ఏమేమి చేయాలో వివరణ.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు అలర్ట్‌. కొన్ని రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసకోవడం ఎంతో ముఖ్యం. ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతలు 2000 రైతుల ఖాతాలకు పంపింది.

ఇప్పుడు రైతులు తదుపరి 13వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద రైతులు ఏడాదికి రూ.6000 అందుకుంటారు. ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.2000 చొప్పున మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ పథకంలో చాలా పెద్ద మార్పులు చేసింది కేంద్రం. అవేంటో తెలుసుకుందాం.

ఈ నిబంధన రద్దు: పీఎం కిసాన్ యోజన ప్రారంభంలో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పరిగణించారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసింది. తద్వారా దేశంలోని 14.5 కోట్ల మంది రైతులు దాని ప్రయోజనం పొందనున్నారు.

ఆధార్ కార్డ్ అవసరం: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనం ఆధార్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది.

రిజిస్ట్రేషన్ సౌకర్యం: ఈ పథకం ద్వారా ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందేలా మోదీ ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. దీని ప్రకారం.. అధికారుల వద్ద వేచి ఉండకుండా ఇప్పుడు రైతులు ఇంట్లో కూర్చొని తమ సొంత రిజిస్ట్రేషన్‌ను సులభంగా చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఉంటే, మీరు pmkisan.nic.in లో రైతుల కార్నర్‌కు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పొరపాటు ఉంటే కూడా మీరే సరిదిద్దుకోవచ్చు.

మీ స్థితిని తెలుసుకోవచ్చు: రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం చేసిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, పీఎం కిసాన్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఏ రైతు అయినా తన స్థితి గురించి సమాచారాన్ని పొందవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు మీ స్థితిని మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ దరఖాస్తు స్థితిని మీ బ్యాంక్ ఖాతాలో ఎంత ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిందో మీరే చూసుకోవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్: ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేవైసీ) కూడా ఈ పథకం కింద జోడించబడింది. అంటే ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డును సులభంగా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, రైతులు కూడా కేసీసీ పై 4 శాతం రూ. 3 లక్షల వరకు రుణాలు పొందుతారు.

మాన్‌ధన్ యోజన ప్రయోజనాలు: పీఎం-కిసాన్ సమ్మాన్ నిధిని సద్వినియోగం చేసుకునే రైతులు ఇకపై పీఎం కిసాన్ మన్‌ధన్‌ యోజన కోసం ఎలాంటి పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద రైతులు పీఎం కిసాన్ పథకం నుండి పొందిన ప్రయోజనాల నుండి నేరుగా పెన్షన్‌ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

రేషన్ కార్డు తప్పనిసరి: కిసాన్ యోజన కింద ఇప్పుడు లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉండాలి. ఇప్పుడు వారి దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలను నమోదు చేసే రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు.

KYC తప్పనిసరి అయింది: ఇప్పుడు పీఎంకిసాన్ యోజన కింద కేవైసీ చేయడం తప్పనిసరి అయింది. మీరు ఇంకా కేవైసీ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. లేకపోతే మీరు తర్వాత వాయిదాను పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Huge changes in PM Kisan before 13th phase. If you don't do this, the money will not go into the account, what to do."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0