Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IOA: A rare honor for PT Usha, the queen of running. For the first time in the 95-year history of IOA.

 IOA: పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం.95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో తొలిసారిగా.

IOA: A rare honor for PT Usha, the queen of running. For the first time in the 95-year history of IOA.

IOA - కేరళలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన పీటీ ఉషను 2022 జులై ఆరంభంలో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేసింది. తాజాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆమె ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నిక కాబోతున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ ఈ బాధ్యతలను చేపట్టబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. జాతీయ ఒలింపిక్ సంఘం హెడ్‌గా వ్యవహరించనున్న తొలి ఒలింపియన్‌, అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణిగానూ ఉష రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.

ఐఓఏ అధ్యక్ష పదవికి డిసెంబర్ 10 ఎన్నికలు జరగనుండగా.. 58 ఏళ్ల ఉష మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రిట్నరింగ్ ఆఫీసర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఆఫీస్ బేరర్ల పోస్టుల కోసం శనివారం 24 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. దీంతో ఉషనే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

మేరీ కోమ్ నాయకత్వంలోని ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ ఎంపిక చేసిన 8 మంది ‘స్పోర్స్‌పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్’లో ఉష ఒకరు కావడం గమనార్హం. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో సెకన్లో వందో వంతు తేడాతో కాంస్య పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయిన ఉష.. ఐఓఏ అధ్యక్షురాలిగా ఏకీగ్రీవంగా ఎన్నిక కానుండటం పట్ల బీజేపీ సీనియర్ నేతలు ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికవుతున్న సందర్భంగా.. దిగ్గజ గోల్డెన్ గర్ల్‌, శ్రీమతి పీటీ ఉషకు అభినందనలు. ప్రఖ్యాత ఐఓఏ ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక అవుతున్న మన దేశ క్రీడా హీరోలకు కూడా అభినందనలు. దేశం వాళ్లను చూసి గర్విస్తోంది’ అని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఉషను ఈ ఏడాది జులైలో బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో ఆమె అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యారు. ఆసియా క్రీడల్లో 11 పతకాలు సాధించిన ఉష.. 1986‌లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లోనే 4 పతకాలు సాధించడం విశేషం. 1983 నుంచి 1998 వరకు ఆసియన్ ఛాంపియన్షిప్స్‌లో14 స్వర్ణాలు సహా 23 పతకాలను ఉష గెలుచుకున్నారు.

పీటీ ఉష (PT Usha) గురించి.

  • ఉష పూర్తి పేరు పిల్లవుల్లకాండి తెక్కేరపరంబిల్ ఉష. కేరళలోని కోజికోడ్ సమీపంలో ఉన్న కుట్టాలిలో 1964 జూన్ 24న ఉష జన్మించారు.
  • 1977లో ఓఎం. నంబియార్ అనే స్పోర్ట్స్ కోచ్ ఉషను గుర్తించారు. బక్క పలచగా ఉండి వేగంగా నడిచే ఆమె మంచి స్ప్రింటర్ అవుతుందని భావించిన ఆయన కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
  • 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్ల, 200 మీటర్ల విభాగాల్లో ఉష రజత పతకాలు సాధించారు.
  • 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌‌లో ఆమె సెకన్లో వందో వంతు టైంలో కాంస్యం సాధించే అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఒలింపిక్స్ ట్రయల్స్‌లో ఆసియా ఛాంపియన్ ఎం.డీ. వలసమ్మను ఓడించిన ఉష.. ప్రి ఒలింపిక్స్ ట్రయల్స్‌లో అమెరికా టాప్ స్ప్రింటర్ జూడీ బ్రౌన్‌ను వెనక్కి నెట్టారు. సెమీస్‌లో 55.54 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని కామెన్వెల్త్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఉష ఫైనల్ చేరారు.
  • 1986 జకార్తా ఏషియన్ గేమ్స్2లో ఉష ఐదు స్వర్ణాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందారు. 1986 సియోల్ ఏసియన్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు, ఓ రజత పతకాన్ని ఉష సొంతం చేసుకున్నారు.
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పని చేసే వి.శ్రీనివాసన్‌ను ఉష 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IOA: A rare honor for PT Usha, the queen of running. For the first time in the 95-year history of IOA."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0