Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lunar Eclipse 2022

Lunar Eclipse 2022 : నవంబరు 8 న చంద్రగ్రహణం , పట్టు - విడుపు సమయాలు , ఏ రాశులవారు చూడకూడదో వివరణ.

Lunar Eclipse 2022

 Lunar Eclipse 2022: ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..

జోతిష్య శాస్త్రాన్ని పాటించే వారు గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. రానున్న రెండు నెలల్లో మరో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో ఒకటి సూర్య గ్రహణం, మరొకటి చంద్ర గ్రహణం. ఈ మధ్యే ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం ముగిసింది. నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఉంది.

2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం
శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.
స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు
మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు
మోక్ష కాలం మధ్యాహ్నం - 6 గంటల 18 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు

ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.

గ్రహణ సమయంలో చదువుకోవాల్సినవి
నవగ్రహ స్తోత్రం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్రుడు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||

బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

రాహు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||

కేతు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

నవగ్రహ గాయత్రి
1.సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

2.చంద్ర గాయత్రి
ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహే
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

3.కుజ గాయత్రి
ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే
తన్నో: కుజః ప్రచోదయాత్.

4.బుధ గాయత్రి
ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహే
తన్నో బుధః ప్రచోదయాత్

5.గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహే
తన్నో గురుః ప్రచోదయాత్

6.శుక్ర గాయత్రి
ఓం భృగువాస జాతాయ విద్మహే శ్వేతవాహనాయ ధీమహే
తన్నో శుక్రః ప్రచోదయాత్

7.శని గాయత్రి
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహే
తన్నో శనిః ప్రచోదయాత్

8.రాహు గాయత్రి
ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహే
తన్నో రాహుః ప్రచోదయాత్

9.కేతు గాయత్రి
ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహే
తన్నో కేతుః ప్రచోదయాత్

నవగ్రహ శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lunar Eclipse 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0