Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

school attendance App Employee Registration

 school attendance App Employee Registration

school attendance App Employee Registration

ఈరోజు CSE EHAZAR IT CELL వారు నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్ లోని ముఖ్య అంశాలు

పాఠశాల విద్యాశాఖ నందలి ప్రతి ఉద్యోగి ( బోధన మరియు బోధనేతర సిబ్బంది-regular and contract ) TIS   టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ముందు నమోదు కావలెను.

పాఠశాల విద్యాశాఖ నందలి ప్రతి ఉద్యోగి స్కూల్ అటెండెన్స్ ఆప్ నందు నమోదై  తమ యొక్క హాజరు ఆన్లైన్ నందు తప్పక   నమోదు చేయవలెను. 

ప్రతి ఉద్యోగి తమ లీవ్ మాడ్యూల్ ని అప్డేట్ చేయవలెను.

ఉప విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు   ఉద్యోగి యొక్క సెలవులను వెంటనే తమ లాగిన్ నందు   ధృవీకరించ వలెను.

ఈ సందర్భంలో ఉప విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి ఎవరికైనా లాగిన్ సమస్యలు ఎదురైనట్లయితే వారు వెంటనే ఆ విషయాన్ని గూగుల్ ఫామ్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సమాచారం తెలుపవలెను.

ఉద్యోగి యొక్క సెలవులను  ధ్రువీకరణ చేయటానికి *ధ్రువీకరణ అధికారి* ఒకటి కంటే ఎక్కువ కార్యాలయములయందు     ధ్రువీకరణ చేయాల్సిన సందర్భంలో ధ్రువీకరణ అధికారి వారికి వేరు వేరు మండలాలకు లేదా డివిజన్లకు   వేరు వేరు లాగిన్ ఐడీలను ఇవ్వబడును.

పై విధంగా లాగిన్ ఐడీలను పొందటానికి అటువంటి ధ్రువీకరణ అధికారులందరూ కూడా తమ వివరాలను గూగుల్ ఫారమందు నింపి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునకు పంపించవలెను. 

స్కూల్ అటెండెన్స్ ఆప్ నందు నమోదు కాని అన్ని రెసిడెన్షియల్  పాఠశాలలు, కేజీబీవీలు,APMS పాఠశాలల యందు   మరియు సమగ్ర శిక్ష, జిల్లా ఉప విద్యాశాఖాధికారి, DI ,మండల విద్యాశాఖాధికారికార్యాలయం నందు పనిచేస్తున్న అందరు  బోధన మరియు బోధనేతర సిబ్బందిని గుర్తించి  వారి వివరాలను నిర్ణీత ప్రొఫార్మా లో  రేపు( 02.11.2022 ). మధ్యాహ్నం 2 గంటలలోగా  పంపవలెను.

అలాగే స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ధృవీకరణ అధికారి లాగిన్ లో  ఉన్నటువంటి డూప్లికేట్ రికార్డు కూడా గుర్తించి వాటిని తొలగింపు కొరకు (DELETE PURPOSE) సదరు ప్రొఫార్మా నందు వివరములను నింపి పంపవలెను.

అలాగే DEO లాగిన్‌లో స్కూల్ అటెండెన్స్ ఆప్ నందు ఉద్యోగిని జోడించడానికి లేదా తొలగించడానికి అవకాశం తీసివేయబడింది.  

ఇంకనూ పాఠశాల లొకేషన్ క్యాప్చర్ చేయనటువంటి పాఠశాలలు  చాలా ఉన్నాయి.  కావున తక్షణమే వారందరూ పాఠశాల లొకేషన్ క్యాప్చర్ చేయ వలసినదిగా కోరడమైనది. పాఠశాల లొకేషన్ క్యాప్చర్ చేయనటువంటి వారు హాజరు వేసినప్పటికీ కూడా యాప్ నందు హాజరు వేయనట్లు గానే భావించబడును.మరియు వారు ఆన్లైన్ నందు హాజరు నమోదు చేయ జాలరు.

అలాగే ధ్రువీకరణ అధికార లాగిన్ నకు పాఠశాల *హాలిడే నమోదు* ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

అలాగే ఆప్షనల్ హాలిడే ని  వ్యక్తిగత లాగిన్ నందు  నమోదు చేయడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

జిల్లా విద్యాశాఖాధికారి అనంతపురం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "school attendance App Employee Registration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0