Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gold is great or diamonds are great? Behind the scenes lies the truth.

 బంగారం గొప్పదా లేకుంటే వజ్రాలు గొప్పవా?తెరవెనుక సత్యాలివే.

Gold is great or diamonds are great? Behind the scenes lies the truth.

చాల మంది వజ్రం ఎప్పటికి నిలిచే ఉంటుంది అంటూ ఊదరగోటు ఉంటారు కానీ బంగారం మాత్రం కొని దాచుకుంటారు. అలాగే బంగారం నిల్వలు మాత్రమే ఉంటాయి కానీ వజ్రాలకు నిల్వలు ఎందుకు ఉండవు.

ఇంకా బంగారం కి ఉన్నట్టు గా ఒక్క ఫిక్స్డ్ రేట్ వజ్రాలకు ఉండదు కానీ దాని విలువ ఎలా నిర్ణయించగలరు.. ఇలా బంగారం మరియు వజ్రాల విషయం లో ఎన్నో అనుమానాలు ఉంటాయి. బంగారం కన్నా వజ్రాలు ధరిస్తేనే విలువ ఎక్కువ అని చాల మంది భ్రమపడుతూ ఉంటారు కానీ అసలు వాస్తవాలు ఏంటి అని ఎవరు బయటకు చెప్పారు.

మనం ఇప్పటి వరకు గోల్డ్ పై లోన్స్ చూసాం కానీ వజ్రాల మీద లోన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని ఎప్పుడు అయినా ఆలోచించారా ? ఇక మార్కెట్ లో కానీ నెట్ లో కానీ గోల్డ్ పరిచే అని సెర్చ్ చేస్తే మనకు ఒక ప్రామాణికమైన రేట్ చూపిస్తుంది. కానీ వజ్రాలకు ఆలా విలువ ఎందుకు కట్టడం లేదు. కొంత మంది తెలియక చేస్తే మరికొంత మంది వీటి విషయంలో జరుగుతుంది ఏంటో తెలియక కొనేస్తూ ఉంటారు. ఒక్కసారి వీటి వెనక ఉన్న ఆ రహస్యాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట బంగారం భూమి లోపల దొరుకుతుంది, వీటిని మైనింగ్ చేసి ఆ తర్వాత పురిఫ్య్ చేసి ప్రాసెస్ అయ్యాక రేట్ నిర్ణయించారు.

అది దేశ విదేశాల్లో వాటి ట్రాన్స్పోర్ట్ రేట్ తో ముడిపడి కాస్త అటు ఇటు గా రేట్ అనేది మారుతుంది. ఇక పోతే వజ్రాల విషయం లో ఇలా కాదు.1902 లో ఒక పది వజ్రాలు మార్కెట్ లో ఉంటె అందులో తొమ్మిది వజ్రాలు డే బేర్స్(DE BEERS ) అనే కంపెనీ వాళ్ళు మైన్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఇలా ఒక కంపెనీ మాత్రమే వజ్రాల మార్కెట్ ని కంట్రోల్ చేయడం వలన వారికి నచ్చిన ధరకు అమ్ముకునే వారు. వాళ్లకు వచ్చినా మోనోపోలీ ని మిస్ యూజ్ చేస్తూ అధికమైన ధరలకు డైమండ్స్ ని అమ్మేవారు. ఆలా వాళ్ళు మొదలు పెట్టిన అవే అధికమైన ధరలను ఆ తర్వాత మార్కెట్ లోకి వచ్చిన అనేక కంపెనీ లు ముందుకు తీసుకెళ్లాయి. ఆ రకంగా ఎలాంటి నిజాయితీ లేకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బు అనేది కస్టమర్స్ దగ్గర నుంచి లక్షల నుంచి కోట్ల వారు కలెక్ట్ చేస్తున్నారు. డైమండ్స్ ఆర్ ఫరెవర్ కానీ ఒక్కసారి కొంటె మళ్లి రీ సెల్ చేయడం మీ వల్ల కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారాన్ని ఎవరు తయారు చేయలేరు. కానీ వజ్రాలను ఈ మధ్య వచ్చినా లేటెస్ట్ టెక్నాలజీ తో ల్యాబ్ లో తయారు చేస్తున్నారు. పైగా ఏది ఆర్టిఫిసీయల్, ఏది నాచురల్ డైమండ్ అనే తేడాను మన కళ్ళతో చూసి కనిపెట్టలేము కాబట్టి కాలంతో పాటు వాటి విలువ కూడా తగ్గుతుంది. అందుకే లక్షల్లో ఖర్చు పెట్టె ముందు ఫ్యాన్సీ యాడ్స్ చూసి మోసపోవద్దు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gold is great or diamonds are great? Behind the scenes lies the truth."

Post a Comment