Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is fasting good for health? isn't it Who can actually do it? An explanation of what the experts are saying.

 ఉపవాసం ఆరోగ్యానికి మంచిదా ? కాదా ? అసలు ఎవరు చేయవచ్చు ? నిపుణులు ఏమి చెబుతున్నారు వివరణ.

Is fasting good for health?  isn't it  Who can actually do it?  An explanation of what the experts are saying.

అన్ని మతాలకు చెందిన వారు ఏదో ఒక సమయంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. హిందువులు వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడి పేరు చెప్పి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. కొందరు వారంలో ఒక్క రోజు ఉపవాసం చేస్తే కొందరు వారంలో రెండు, మూడు, నాలుగు రోజులు ఉపవాసం చేసే వారు ఉంటారు. ఉపవాసం చేయడం మంచిదా కాదా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఉపవాసం మంచిదా? కాదా? అనే విషయాలను తెలుసుకునేందుకు మొదటగా ఉపవాసం చేసిన సమయంలో శరీరంలో జరిగే మార్పులు ఏంటి అనేది తెలుసుకుందాం. 

ప్రతి రోజు కూడా జీర్ణ వ్యవస్థ మనం తీసుకున్న మొత్తం ఆహారాన్ని జీర్ణం చేయలేదు. అలా జీర్ణం కాని ఫుడ్‌ ఏదో ఒక రూపంలో నిల్వ ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కనుక వారంలో ఒక్క రోజు లేదా ఒక పూట అయినా ఫుడ్ లేకుండా ఉండటం వల్ల శరీరంలో నిల్వ ఉన్న పదార్థాలు అన్నీ కూడా జీర్ణం అవుతాయి. ఎప్పుడైతే ఆహారం తీసుకోమో నిరుపయోగంగా ఉన్న కొవ్వు మరియు పోషకాలను శరీరం వినియోగించుకుంటుంది. తద్వారా శరీరంలో ఉన్న చెత్త కొంతలో కొంత అయినా తగ్గుతుంది. కనుక వారంలో ఒకసారి ఉపవాసం మంచిదే అంటున్నారు. అయితే ఆ రోజు మూడు పూటలు తినకుండా కొందరు ఉంటారు. అలా చేయకూడదు. కొంతలో కొంత అయినా అంటే ఒక్క పూట వరకు అయినా తీసుకోవాలి. అలా తీసుకోకుంటే అల్సర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక  వారంలో ఒకసారి ఉపవాసం చేసిన సమయంలో కనీసం టిఫిన్‌ తిన్నా అల్సర్‌ సమస్యకు  చెక్‌ పెట్టవచ్చు. 

ఇక కొందరు వారంలో రెండు మూడు రోజులు అంతకు మించి కూడా ఉపవాసాలు చేసే వారు ఉన్నారు. ఉపవాసాలు ఎక్కువగా చేస్తున్నామని చెప్పే వారు చాలా మంది చాలా రకాలుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరైతే వారంలో కేవలం ఒక్క రోజు అది కూడా ఒక పూట తిని ఉపవాస దీక్ష చేస్తారో వారు పలు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటారు. వారి జీర్ణ వ్యవస్థ మెరుగు పడటం మాత్రమే కాకుండా రెగ్యులర్‌ మెటబాలిజం కూడా బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం మంచిదే కాని వారంలో రెండు మూడు రోజుల ఉపవాసాలు మాత్రం ఏ ఒక్కరు సమర్థించరు. ముఖ్యంగా ఆడవారు 50 కేజీల బరువు కంటే తక్కువ ఉన్న వారు.. మగవారు 60 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న వారు ఒక్కసారి ఉపవాసం చేసేందుకు అర్హులు. అంతకు చాలా తక్కువ బరువు ఉంటే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపవాస దీక్షలు ప్రయత్నించవద్దు అంటూ నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is fasting good for health? isn't it Who can actually do it? An explanation of what the experts are saying."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0