Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Year: Let us know why New Year is celebrated on 1st January.

కొత్త సంవత్సరం: న్యూ ఇయర్ వేడుకలు జనవరి 1వ తేదీనే ఎందుకు జరుపుకొంటామో తెలుసుకుందాం.

New Year: Let us know why New Year is celebrated on 1st January.

ప్రపంచవ్యాప్తంగా ప్రజ ptలంతా కొత్త సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. బహుశా మీరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఉంటారు.

అయితే, నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభం అవుతుంది? ఈ రోజునే ఎందుకు వేడుకలు జరుపుకోవాలి

దీనికి సమాధానం కావాలంటే 2000 సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే.

క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు

సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు.

''భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని ప్రవేశపెట్టాల్సి వచ్చింది'' అని కీల్ యూనివర్శిటీ అబ్జర్వేటరీ డైరెక్టర్ డాక్టర్ జాకో వాన్ లూన్ చెప్పారు.

అయితే భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి.

కాగా, క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది.

రోమన్లకు జనవరి నెల ప్రముఖమైనది. ఎందుకంటే వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది.

రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?

బౌడికా: రోమన్లను తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు

హిందువులు పూజించే బ్రహ్మకు నాలుగు తలలు ఉన్నట్లుగా రోమన్లు ఆరాధించే జనస్‌కు రెండు తలలు. ఈయన్ని ప్రారంభాల దేవత (గాడ్ ఆఫ్ బిగినింగ్స్)గా రోమన్లు భావిస్తుంటారు

''ఆయన ముందు, వెనుక.. రెండువైపులా చూడగలరు. ఏదైనా ఫ్రెష్‌గా ప్రారంభించేందుకు ఏడాది మొత్తంలో ఏదైనా సమయాన్ని ఎవరైనా ఎంచుకోవాలంటే ఇదే సరైనది అని (యురోపియన్లు) భావించేవారు'' అని బర్మింగ్‌హమ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డయానా స్పెన్సర్ చెప్పారు.

యూరప్‌లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా ఇప్పుడే.

''రోమన్లకు ఇదొక శక్తివంతమైన కాలం. ఎందుకంటే వారు అప్పటి వరకూ పగటి వేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తుంటారు. వారి ప్రపంచమంతా చీకటిగా, చల్లగా ఉంటుంది. ఏదీ వృద్ధి చెందదు. చేసేందుకు ఏ పనీ ఉండదు.. ముఖ్యంగా పొలాల్లో. (శీతాకాలం) ఒక విశ్రాంతి సమయం లాంటిది'' అని డయానా తెలిపారు.

రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది.

అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది

అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.

చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి. ఎందుకంటే.. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా దానికి ప్రాశస్త్యం ఉంది.

''క్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్. అయితే, దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నావంటూ మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చిలో. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుంది. మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలనటానికి ఇది కూడా ఒక కారణం'' అని డయానా వివరించారు.

పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్ధంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.

క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.

మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు

అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది.

అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.

అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను, కళ్లు మిరుమిట్లు కొలిపే రీతిలో ప్రజల సంబరాలను చూస్తున్నాం.

వాస్కోడిగామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..

భారత ప్రభుత్వ రాజపత్రం.. గెజిట్

మరి భారతదేశం జాతీయ క్యాలెండర్ ఏది?

వాస్తవానికి భారతదేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తోంది. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం శాలివాహన శకాన్ని కూడా పాటిస్తున్నారు.

దాన్ని బట్టి చూస్తే ఈ రోజు 1940వ సంవత్సరం పుష్య మాసం 11వ తేదీ.

అమ‌రావ‌తి కేంద్రంగా పాలించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి ప‌ట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహ‌న శ‌కం ప్రారంభం అయ్యిందని భావిస్తుంటారు. అలా ఇప్ప‌టికి 1939 ఏళ్లు గ‌డిచాయి. ఇప్పుడు 1940వ సంవత్సరంలో ఉన్నాం. తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠీ ప్ర‌జ‌లు ఈ కేలండర్ వాడ‌తారు.

ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 78 నుంచి మొదలవుతుంది.

శాలివాహన శకం క్యాలెండర్‌లో మొదటి మాసం చైత్రం. సాధారణంగా ఇది మార్చి 22వ తేదీన వస్తుంది. లీపు సంవత్సరం అయితే మార్చి 21వ తేదీన వస్తుంది.

భారత ప్రభుత్వం 1957 మార్చి 22వ తేదీ నుంచి ఈ శాలివాహన శకం క్యాలెండర్‌ను అధికారికంగా పాటిస్తోంది.

భారత ప్రభుత్వ రాచపత్రం (గెజిట్), ఆలిండియా రేడియో వార్తల ప్రసారం, భారత ప్రభుత్వం జారీ చేసే క్యాలెండర్లు, ప్రజలకు అందించే సమాచారానికి సంబంధించిన రాతప్రతులపై గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలతో పాటుగా శక క్యాలెండర్‌ తేదీలను పొందుపర్చాల్సి ఉంటుంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Year: Let us know why New Year is celebrated on 1st January."

Post a Comment