AP Government Good News for Government Employees.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ .
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సమయ పాలన.. తీసుకొచ్చిన కొత్త విధానాలతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు..పెండింగ్ డీఏల పైన ప్రభుత్వంతో సంప్రందింపులు మొదలయ్యాయి. ఏపీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిల పైన చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల డీఏలతో పాటుగా బకాయిల చెల్లింపుకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు.
ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్ ను పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు..గత ఏడాది రెండు డీఏల చెల్లింపు విషయాన్ని సీఎంకు వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగులకు సంక్రాంతికి ఒక డీఏ ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా గత రెండేళ్లుగా బకాయిలను ఏప్రిల్ నుంచి చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీ పైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. ప్రతీ నెలా వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. ప్రతీ నెలా 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కోరారు.
ఇక, ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారిత హాజరుపై క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించినట్లుగా నేతలు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే వారికి మినహాయింపు ఇవ్వాలని సంఘాల నేతలు సీఎం ను కోరారు. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని కోరినట్లుగా వెల్లడించారు.మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి ఒక డీఏ విడుదలకు హమీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వేళ ఈ డీఏ విడుదలకు నిర్ణయించారు.
0 Response to "AP Government Good News for Government Employees."
Post a Comment