Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Banks work for 18 days in February. Holiday list details

 ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులు ప‌ని చేసేది 18 రోజులే. సెలవుల జాబితా వివరాలు

డిజిటల్ పేమెంట్స్ రాకతో అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలు స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. పేమెంట్లు చేయాలన్నా, మనీ ఇంకొకరికి పంపాలన్నా క్షణాల్లో పంపేస్తున్నాం.. అయినప్పటికీ కొన్ని పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లడం తప్పనిసరి. ఇక వ్యాపారస్తులయితే ప్రతిరోజూ బ్యాంకులను సందర్శిస్తున్నారు. డీడీ కావాలనో.. భారీ మొత్తంలో నగదు చెలామణి చేయాలనో.. ఇలా ఏదో ఒక అవసరం బ్యాంకుకు రప్పిస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా బ్యాంకు పనిదినాల గురుంచి తెలుసుకోవాల్సిందే.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. ఫిబ్ర‌వ‌రి నెల‌లో బ్యాంకుల‌ సెల‌వు దినాలు వెల్ల‌డించింది. ఈ జాబితా ప్ర‌కారం వ‌చ్చే నెల‌లో 10 రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌వు. శని, ఆదివారాలు కాకుండా.. మహాశివరాత్రి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సెలవు దినాలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా మారుతుంటాయి. నేష‌న‌ల్ బ్యాంక్ హాలీడేస్ మాత్రం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతాయి.

2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకుల సెలవుల జాబితా.

  • ఫిబ్రవరి 5, 2023 – ఆదివారం (దేశమంతటా సెలవు)
  • ఫిబ్రవరి 11, 2023 – రెండో శనివారం (దేశమంతటా సెలవు)
  • ఫిబ్రవరి 12, 2023 – ఆదివారం (దేశమంతటా సెలవు)
  • ఫిబ్రవరి 15, 2023- లూయి న‌గాయినీ వేడుక‌ (మ‌ణిపూర్‌లో మాత్రమే సెలవు)
  • ఫిబ్రవరి 18, 2023 – మహాశివరాత్రి (తెలుగు రాష్ట్రాలలో, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, కాన్పూర్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పుర్, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా,  తిరువనంతపురం నగరాల్లోని బ్యాంకులకు సెలవు)
  • ఫిబ్రవరి 19, 2023 – ఆదివారం (దేశమంతటా సెలవు)
  • ఫిబ్రవరి 20, 2023 – అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరం ఆవిర్భావ దినోత్స‌వం(అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరంలో మాత్రమే సెలవు)
  • ఫిబ్రవరి 21, 2023- లోసార్ పండుగ (సిక్కింలో మాత్రమే సెలవు)
  • ఫిబ్రవరి 25, 2023 – నాలుగో శ‌నివారం (దేశమంతటా సెలవు)
  • ఫిబ్రవరి 26, 2023 – ఆదివారం (దేశమంతటా సెలవు)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Banks work for 18 days in February. Holiday list details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0