Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mobile Side Effects

 Mobile Side Effects: ఎక్కువ సేపు ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్ వివరాలు.

Mobile Side Effects

ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరూ ఫోన్ వాడుతున్నారు. ఫోన్ వాడకం అనేది దినచర్యగా మారింది. ప్రతి చిన్న పని మొబైల్ పైనే ఆధారపడాల్సి వస్తుంది.

ఆఫీస్ వర్క్ అవసరాల దృష్ట్యా ల్యాప్ టాప్ ను కూడా వాడుతుంటాం. అలాగే ఇంట్లోని ఆడవారు ఎక్కువ సేపు టీవీ చూస్తుంటారు. అయితే ఎక్కువ సేపు స్రీన్ సమయం గడపుతుంటే నిద్ర భంగం కలుగుతుందని నిపుణులు ఎప్పుడూ చెప్పే మాటే. అయితే ఫోన్ లేదా ఇతర ఉపకరణాలు ఎక్కువ సేపు వాడితే చర్మం, జుట్టు సమస్యలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్ నుంచి వచ్చే వెలుగు మన మెదడు పని తీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. స్కిరాడియన్ సైకిల్ పై ప్రభావం చూపడంతో నిద్ర సమయం తగ్గుతుంది. అలాగే ఇటీవల వెల్లడైన అధ్యయనాల ప్రకారం ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడిన కిరణాల కారణంగా రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల ఉత్పత్తి కారణం కావచ్చని తెలుస్తోంది. ఇది శరీరానికి అవసరమ్యే యాంటీ ఆక్సిడెంట్లకు కీడు చేయడంతో, జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ వాడకం వల్ల కలిగే సమస్యలు ఇవే

మొబైల్, ల్యాప్ టాప్, టీవీ లను నుంచి వెలువడే కిరణాల వల్ల ముఖ్యంగా మొఖంపై మొటిమల సమస్య పెరుగుతుందని చర్మ వాధి నిపుణులు చెబుతున్నారు. అలాగే అకాల వృద్ధాప్యం, చర్మంపై ముడతల సమస్య వస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజిన్ ఉత్పత్తి పడిపోతుంది. లూపస్, రొసెమియా వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే జుట్టుపై స్క్రీన్ కిరణాలు పడడం వల్ల ఇబ్బంది లేనప్పటికీ ఎక్కువ సేపు ఫోన్ వాడడం వల్ల సిర్కాడియన్ చక్రం దెబ్బతింటుంది. దీంతో ఒత్తిడి సమస్య పెరిగి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వాడకాన్ని తగ్గిస్తూ, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం, చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

జుట్టు, చర్మ సమస్యల నుంచి రక్షణకు మార్గాలు

వీలైనంతగా రాత్రి సమయంలో ఫోన్, ల్యాప్ టాప్ వాడకుండా పగలే పనిని పూర్తి చేసుకోవాలి. అలాగే తప్పనిసరై వాడాల్సి వస్తే ఫోన్ లో నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిరణాల వల్ల కలిగే ఇబ్బందిని కొంత మేరక తగ్గించవచ్చు. అలాగే చర్మ రక్షణకు సన్ స్క్రీమ్ ను రాసుకోవాలి. ముఖ్యంగా పడుకునే ముందు ఫోన్, ట్యాబ్ వాడకాన్ని నిరోధించాలి. ఇలా చేయకపోతే అధికంగా మెలటోనిన్ ఉత్పత్తి కావడం వల్ల నిద్ర కోల్పోతాం. దీంతో జుట్టు రాలే సమస్య కూడా తీవ్రం అవుతుంది. మొత్తం మీద నిపుణులు మాత్రం పడుకునే ముందు మాత్రం ఫోన్, ట్యాబ్ వాడకపోతే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mobile Side Effects"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0