EPF e-passbook:
EPF e-passbook: ఈపీఎఫ్ఎకు ఏమైంది? కానరాని ఇ-పాస్బుక్ సేవలు!
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్ ఇ-పాస్బుక్ (EPF e-passbook) సేవలు నిలిచిపోవడంతో చందాదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గతేడాది సైతం కొన్నిరోజుల పాటు ఇ-పాస్‌బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ అయినట్లు పాస్‌బుక్‌లో చూపించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నించారు. అయితే, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందంటూ ఆర్థిక శాఖ అప్పట్లో స్పష్టతనిచ్చింది. తాజాగా ఇ-పాస్‌బుక్ చూద్దామంటే అసలే అందుబాటులో లేకుండా పోయిందని నెటిజన్లు వాపోతున్నారు. అటు ఉమాంగ్ యాప్‌లోనూ (UMANG App) అదే పరిస్థితి ఎదురవుతోంది. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా అసౌకర్యం ఏర్పడుతున్నట్లు చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇంకెన్ని రోజలు వేచి చూడాలని సామజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు.
0 Response to "EPF e-passbook:"
Post a Comment