Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If your children are very weak then this should be included in their diet

 మీ పిల్లలు బక్కగా బలహీనంగా ఉన్నారా అయితే వారి డైట్ లో ఇది ఉండాల్సిందే.

If your children are very weak then this should be included in their diet

మీ పిల్లలు బక్కగా బలహీనంగా ఉన్నారా అయితే వారి డైట్ లో వీటిని చేర్చాలో వివరణ.

కొందరు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ప్రతి దాంట్లో చురుగ్గా పాల్గొంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం బక్కగా బలహీనంగా ఉంటారు. ఇలాంటివారు ఏ విషయంలోనూ చురుగ్గా ఉండలేరు.

చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో సైతం పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోతుంటారు. ఎప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ జాబితాలో మీ పిల్లలు ఉన్నారా..? అయితే తప్పకుండా వారి డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఉండాల్సిందే. ఈ స్మూతీని పిల్లలకు ఇవ్వడం వల్ల వారు పుష్టిగా మారతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా ఒక అరటిపండు ను తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి. అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి. నైట్ అంతా వాటర్ లో నానపెట్టుకున్న వాల్ నట్స్ మూడు, జీడిపప్పు ఐదు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తొలగించిన పల్లీలు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.

ఈ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది. పిల్లల బ్రేక్ ఫాస్ట్ లో ఈ హెల్తీ స్మూతీని చేరిస్తే చక్కగా బరువు పెరుగుతారు. బలహీనత దూరమై బలంగా చురుగ్గా మారతారు. అలాగే మీ పిల్లల డైట్ లో ఈ స్మూతీని చేర్చడం వల్ల వారి బ్రెయిన్ డెవలప్మెంట్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీంతో తరచూ అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. పైగా ఈ స్మూతీని పిల్లలకు ఇవ్వడం వల్ల తరచూ నీరసం అలసటకు గురి కాకుండా ఉంటారు. వారి ఎముకలు కండరాలు సైతం దృఢంగా మారతాయి. కాబట్టి తప్పకుండా మీ పిల్లల డైట్ లో ఈ హెల్తీ స్మూతీని చేర్చేందుకు ప్రయత్నించండి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If your children are very weak then this should be included in their diet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0