Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What should children do to grow taller? Advice and suggestions from Dr. Naveen Nadiminti, Ayurvedic expert.

 పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? డాక్టర్‌ నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు గారి సలహాలు మరియు సూచనలు.

What should children do to grow taller?  Advice and suggestions from Dr. Naveen Nadiminti, Ayurvedic expert.

తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించాలి.

దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. ఎత్తు పెరగడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు. కృత్రిమంగా వచ్చేదీ కూడా కాదు.


ఆపరేషన్ చేయించుకుంటే వచ్చేది కాదు. ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది.

క్యారెట్

క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

►బీన్స్ 

ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

►బెండకాయ 

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

►బచ్చలికూర 

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

►బఠానీలు

బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు 

బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

►సోయాబీన్ 

ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

►పాలు 

రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.


మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.

ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.

►గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయటానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

►ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

►ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు.

మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.

- డాక్టర్‌ నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What should children do to grow taller? Advice and suggestions from Dr. Naveen Nadiminti, Ayurvedic expert."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0