Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Minimum Balance

 Minimum Balance: బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి? 40 బ్యాంకుల వివరాలు.

Minimum Balance

Interest Rates  బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు కచ్చితంగా ఒక విషయం గుర్తించుకోవాలి.

సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. అందువల్ల ఏ బ్యాంక్‌లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సిటీ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.2 లక్షల దాకా ఉండాలి. అలాగే డీబీఎస్ బ్యాంక్‌లో అయితే యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ రూ. 10 వేల నుంచిరూ. 25 వేల వరకు ఉండాల్సిందే. ఇక డాషే బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ రూ. 15 వేలు ఉండాలి.

అలాగే హెచ్ఎస్‌బీసీ బ్యాంక్‌లో యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు కావాలి. స్కోటియా బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 3 లక్షల వరకు ఉండాలి. స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంక్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 10 వేలుగా ఉంది. ఇవ్వన్నీ ఫారిన్ బ్యాంకులు.

బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.2 వేలు వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఇదే విధమైన మినిమమ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ అవసరం అవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యావరేజ్ క్వార్టరీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉండాలి. కెనరా బ్యాంక్‌లో అయితే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.1000గా ఉండాలి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.2 వేల వరకు ఉండాలి. ఇండియన్ బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ 500 నుంచి రూ. 2500 వరకు ఉండాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ కస్టమర్లు అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు అయితే రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. పంజాబ్ అంద్ సింద్ బ్యాంక్‌లో అయితే రూ. 500 నుంచి రూ. 1000 మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే యావరేజ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదు. యూకో బ్యాంక్‌లో అయితే యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ రూ. 250 నుంచి రూ. 1000 వరకు ఉండాలి. యూనియన్ బ్యాంక్‌ కస్టమర్లు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 250 నుంచి రూ.1000 వరకు కలిగి ఉండాలి.

యాక్సిస్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 12 వేల వరకు ఉండాలి. బంధన్ బ్యాంక్‌లో అయితే రూ.5 వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. క్యాథోలిక్ సిరియన్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 5 వేలు వరకు ఉంది. సిటీ యూనియన్ బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ రూ. 7500 ఉండాలి. డీసీబీ బ్యాంక్‌లో మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 5 వేలు వరకు ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంక్‌లో మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1000గా ఉంది. ఫెడరల్ బ్యాంక్‌లో మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 5 వేలుగా ఉండాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 10 వేల వరకు ఉండాల్సిందే. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఉండాలి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 10 వేలుగా ఉండాలి. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 1500 నుంచి రూ. 10 వేల వరకు ఉండాలి. జే అండ్ కే బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేలు. కర్నాటక బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 1000 నుంచి రూ.2 వేల వరకు ఉండాలి.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉండాలి. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 5 వేలు ఉండాలి. ఆర్‌బీఎల్ బ్యాంక్ కస్టమర్లు రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. యస్ బ్యాంక్ కస్టమర్లు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో రూ.1000 నుంచి రూ. 2500 వరకు మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి.

అలాగే ఏయూ స్మార్ట్ ఫైనాన్స్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఉంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ. 2500 నుంచి రూ. 10 వేల వరకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. సూర్యోదయ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.2 వేల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి. ఉజ్జీవన్ బ్యాంక్‌లో యావరేజ్ బ్యాలెన్స్ అక్కర్లేదు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Minimum Balance"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0