Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today is Shri Markandeya Maharshi Jayanti

ఈరోజు శ్రీ మార్కండేయ మహర్షి జయంతి

Today is Shri Markandeya Maharshi Jayanti

మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి , శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.

మృకండు మహర్షి తపస్సు

మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారికున్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశి కి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి , శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షి ని మరోమారు పరీక్ష చేయడానికి , సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.

సప్తర్షులు ఆశీర్వచనం

మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలునిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి *'మార్కండేయుడు'* అని నామకరణం చేశారు. 7 సంవత్సరాలు 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షిని చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవా అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.

నారదుడు యముడిని మార్కండేయుడుని కలవడం

మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడు కి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందీని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.

మార్కండేయుడు చిరంజీవి అవడం

విష్ణువునుపూజిస్తున్న మార్కండేయుడు

16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లు ని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి ! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.

యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌| 1

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |

శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |

క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం |

ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం |

భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 3

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం |

పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్‌ |

దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 4

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం |

శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్‌ |

క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్‌ |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 5

కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం |

నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్‌ |

అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 6

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం |

దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్‌ |

భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 7

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం |

సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |

సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 8

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం |

సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్‌ |

క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 9

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ |

యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్‌ |

పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం |

చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత:| 10

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today is Shri Markandeya Maharshi Jayanti"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0