Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Monthly revision of electricity charges

 నెలనెలా విద్యుత్ ఛార్జీల సవరణ

Monthly revision of electricity charges

  • ఇంధన భారాన్నీ వినియోగదారుడి నుంచి రాబట్టాలి
  • నిబంధనలను సవరించిన కేంద్ర విద్యుత్తు శాఖ

నాడు, దిల్లీ: విద్యుదుత్పత్తికి వినియోగించే ఇంధనం ఛార్జీలు, విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్‌గా వినియోగదారుడిపై వేసేలా విద్యుత్తు కమిషన్‌ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్తుశాఖ తాజాగా పేర్కొంది.

ఈ మేరకు విద్యుత్తు నిబంధనలు-2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేసింది. భారాన్ని నెలవారీగా ఆటోమేటిగ్గా వినియోగదారుల టారిఫ్‌కి మళ్లించేలా విద్యుత్తు కమిషన్‌ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. ఆ నెలవారీ ట్రూఅప్‌ ఛార్జీలను వార్షిక ప్రాతిపదికన నిర్ధారించాలని స్పష్టంచేసింది. విద్యుత్తు కమిషన్‌ ఈ కొత్త ఫార్ములా ఖరారు చేసేంతవరకూ ఈ నిబంధనల్లో చెప్పిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంచేసింది.

  • ఇంధనం, విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు సర్‌ఛార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తుసరఫరా చేయడానికి అయ్యేఖర్చు పెరగడమని అర్థం చేసుకోవాలి.
  • ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లుల్లో కలపాలి. నియంత్రణ సంస్థ అనుమతుల ప్రక్రియ అవసరం లేకుండానే రాష్ట్ర కమిషన్‌ నిర్దేశించిన ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్‌గా నెలవారీగా ఈ పనిచేయాలి.
  • ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులు, అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల్లో నెలవారీగా వచ్చిన వాస్తవ తేడా ఆధారంగా ఈ సర్‌ఛార్జిని లెక్కించాలి. ఉదాహరణకు ఏప్రిల్‌ నెలలో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులో తేడా వస్తే ఆ భారాన్ని జూన్‌ నెల బిల్లులో కలపాలి.
  • వినియోగదారులకు టారిఫ్‌ షాక్‌లు ఇవ్వకుండా డిస్కంలు ఎప్పటికప్పుడు ఇంధన, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులను లెక్కించి ఆ తర్వాతి నెలలో వాటిని బిల్లుల్లో చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండునెలలకు మించి జాప్యం జరగకూడదు.
  • విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ ముందుకు ఏదైనా వివాదం వస్తే దాన్ని 120 రోజుల్లోపు పరిష్కరించాలి. ఆ పరిమితిని స్పష్టమైన కారణాలతో మరో 30 రోజులు పొడిగించవచ్చు. ఏదైనా కారణంతో తుది ఉత్తర్వు వెలువరించలేని పరిస్థితి ఉంటే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా పేర్కొంటూ కమిషన్‌.. పైన పేర్కొన్న కాలపరిమితి లోపు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. 120/150 రోజుల్లోపు తుది ఉత్తర్వులు వెలువడని పరిస్థితి ఉంటే ఉపశమనం కోసం బాధిత పక్షం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడానికి ఈ కొత్త నిబంధన వీలు కల్పించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Monthly revision of electricity charges"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0