Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sankranti

Sankranti 2023: పూజా ముహూర్తం, తిథి, పుణ్యకాలం. సంక్రాంతి గురించి ముఖ్యమైన విషయాలు మీ కోసం.

 సంక్రాంతి 2023: హిందువుల పవిత్రమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ ఏడాది జనవరి 15 న సంక్రాంతిని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా పూజా ముహూర్తం నుంచి ఆచారాల వరకు, పండుగ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకుందాం..

భారతదేశంలో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. పురాణాల ప్రకారం.. ఈ పండుగను దానధర్మాలకు, ఆరాధనకు, యజ్ఞానికి పవిత్రమైనదిగా భావిస్తారు. సంక్రాంతి అని కూడా పిలువబడే మకర సంక్రాంతి అనే పేరు సూర్యభగవానుడికి గుర్తుగా వచ్చింది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినందుకు గుర్తుగా ఈ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చేతికొచ్చిన పంటలను ఆరాధించడం, వాటిని సంతోషంగా పంచుకోవడం వల్ల ఇది పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. పంచాంగం ప్రకారం.. మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ గా, గుజరాత్, రాజస్థాన్ లలో ఉత్తరాయనన్ గా, హర్యానా, పంజాబ్ లో మాఘీగా , తూర్పు ఉత్తర ప్రదేశ్ లో కిచిడీగా సెలబ్రేట్ చేసుకుంటారు.

పూజా ముహూర్తం

భోగి తర్వాతి రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15, 2023 ఆదివారం ఈ పండుగ జరగనుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం.. జనవరి 14 న సంక్రాంతి తిథి రాత్రి 8:57 గంటలకు ఉంటుంది. మకర సంక్రాంతి పుణ్య కాలం ఉదయం 7:15 నుంచి సాయంత్రం 5:46 వరకు ఉంటుంది. వ్యవధి: 10 గంటల 31 నిమిషాలు. ఇకపోతే మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉదయం 7:15 నుంచి రాత్రి 9:00 గంటల వరకు (వ్యవధి - 1 గంట 45 నిమిషాలు) ఉంటుంది.

మకర సంక్రాంతి ఆచారాలు

నిజానికి సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు రోజుల వరకు జరుగుతాయి. ఈ పండుగకు సూర్యుడిని నిష్టగా పూజిస్తారు. గతంలో చేసిన తప్పులన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు కలగాలని గంగా, యమునా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం ఆచరిస్తారు. సూర్యభగవానుడిని పూజించడంతో పాటుగా గాయత్రి మంత్రం, శని, సూర్య మంత్రాన్నిపఠిస్తారు.

మకర సంక్రాంతి పండుగ రోజున బెల్లం, నువ్వులను చాలా మంది ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వులను దానం కూడా చేస్తారు. దీనివల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు కూడా ఇస్తారు. అంతేకాదు ఈ పండుగ పర్వదినాన పెళ్లైన కూతుర్లకు కిచెన్ సామాగ్రిని ఇస్తారు కూడా. నిరుపేదలకు దానధర్మాలు చేస్తుంటారు. దీనివల్ల ఈ రోజు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లలో కిచిడీని తయారు చేసి తింటుంటారు. అందుకే మకర సంక్రాంతిని తరచుగా కిచిడీ అని కూడా పిలుస్తారు. గోరఖ్ నాథ్ పుణ్యక్షేత్రానికి కిచిడీ నైవేద్యాలు ఆనవాయితీగా సమర్పిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sankranti"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0