Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers salaries

ఇంకా అందని జీతాలు

Teachers salaries

  • ఇఎంఐలకోసం అప్పుల తిప్పలు
  • ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

నెల్లో నాలుగు రోజులు గడిచిపోయినా ఇంకా చాలామందికి జీతాలు పడలేదు. దాదాపు రెండు వేల కోట్ల వరకు జీతాలకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. వరుసగా ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్తున్నప్పటికీ నిధులు చాలడం లేదని అధికారులు అంటున్నారు. జనవరిలూ ఐదో రోజు వచ్చినప్పటికీ ఇంకా సచివాలయం, ఇతర కీలక శాఖల్లో కొంతమందికి జీతాలు వచ్చినప్పటికీ చిన్న ఉద్యోగులకు జీతాలు పడలేదని తెలుస్తోంది. ప్రధానంగా పింఛనుదారులకు చాలామందికి పింఛను అందలేదు. దీంతో కొత్త సంవత్సరంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతి నెలా ఐదో తేదీన చెల్లించేందుకు ఇఎంఐల ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వారంతా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఓవర్ డ్రాఫ్ట్ లొనే

మూడో త్రైమాసికం గత నెల 31వ తేదీన ఓడిలో ముగియగా, జనవరిలో అదే ఓడి కొనసాగుతోంది. ఒకటో తేదీ నుంచి మూడో తేదీవరకు ఓవర్ డ్రాఫ్ట్లోనే ఉండడం గమనార్హం. తాజాగా మంగళవారం రెండు వేల కోట్లకుపైగా ఓడిలో ఉండడంతో వచ్చిన ఆదాయం వచ్చినట్లుగా రిజర్వ్ బ్యాంకు జమ చేసుకుంటోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers salaries"

Post a Comment