Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How many lessons have you heard by Baijus?

బైజూస్‌ పాఠాలు ఎంత విన్నారు?

How many lessons have you heard by Baijus?

  • వివరాలను సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయండి
  • ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ ఒత్తిడి

విద్యార్థులు బైజూస్‌ పాఠాలు ఎంత వరకూ విన్నారు? ఏఏ సబ్జెక్టులు ఎంత మేర పూర్తి చేశారన్న వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. బైజూస్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నచోట ఎక్కువ సమయం ఈ పనికే సరిపోతోంది. బోధనేతర పనులతో బోధనకు ఆటంకం ఏర్పడుతోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణీ చేసింది. వీటిని విద్యార్థులు ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ వివరాలు సేకరిస్తోంది. వాస్తవంగా ట్యాబ్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే ఆన్‌లైన్‌లో తీసుకోవడం చాలా తెలిక. కానీ, చాలామంది పిల్లలు ఆఫ్‌లైన్‌లో వినియోగిస్తుండడంతో ఉపాధ్యాయులనే వివరాలు నమోదు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పిల్లల హాజరు యాప్‌లోనే బైజూస్‌కు ప్రత్యేకంగా ఒక ఆప్షన్‌ పెట్టారు. పిల్లలు వీడియోలు చూసి, పరీక్షలను రాస్తేనే విద్యార్థి ఎంత శాతం వినియోగించిందీ తెలుస్తుంది. కొందరు విద్యార్థులు వీడియోలను విని, వదిలేస్తుండగా.. మరికొందరు మాక్‌టెస్ట్‌ మాత్రమే చేస్తున్నారు. ఇలాంటి పిల్లలు ఎంత వినియోగించిందీ నమోదు కావడం లేదని ఉపాధ్యాయులు చెప్పారు. కొందరు విద్యార్థులు ట్యాబ్‌లకు పాస్‌వర్డ్‌లు పెడుతున్నారు. వీటిని వారు మర్చిపోతుండటంతో ఒపెన్‌ కావడం లేదు. ఇలాంటి వాటిపై ఐటీ విభాగానికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌ నమోదును మాత్రమే చూస్తున్నారు. ట్యాబ్‌ల వినియోగంలో జిల్లాల మధ్య పోటీ పెడుతుండడంతో ఎవరికి వారు ఎక్కువ వాడినట్లు చూపించేందుకు పోటీ పడుతున్నారు. అసలు విద్యార్థులు ఇంటి వద్ద బైజూస్‌ పాఠాలు వింటున్నారా? వారు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? వారికి ఎమైన ఉపయోగపడుతున్నాయా అనేదాన్ని వదిలేసి, ఎంత వరకు వినియోగించారనేదానిపై లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. దీంతో ఎక్కువ వీడియోలు చూడాలని ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How many lessons have you heard by Baijus?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0