Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Rythu Bharosa Kendralu

Rythu Bharosa Kendralu: యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఆర్బీకేలు.. ఇకపై తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌.

Rythu Bharosa Kendralu

యూనివర్సిటీలు, అనుబంధ, ప్రై వేటు కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు ఇక నుంచి విధిగా ఆర్బీకేల్లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహించేలా మార్పుచేశారు.

ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యార్థులు ఇందుకు శ్రీకారం చుట్టగా, మత్స్య యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

విజ్ఞాన భాండాగారాలుగా ఆర్బీకేలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఆర్బీకేలు రెండున్నరేళ్లుగా రైతులకు విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. వన్‌స్టాప్‌ సెంటర్‌గా వీటిని తీర్చిదిద్దారు. బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, సబ్సిడీయేతర విత్తనాలు, పురుగుల మందులతోపాటు ఎరువులను రైతు ముంగిటకు సరఫరా చేస్తున్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల ద్వారా అద్దెకు సాగు యంత్రాలనూ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే, ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లు, డిజిటల్, స్మార్ట్‌ గ్రంథాలయాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక పోకడలు, మెళకువలను మారుమూల రైతులకు అందిస్తూ వాటిని నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక వీటిల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లలో రెండు కోట్ల మందికి పైగా రైతులు వీటి ద్వారా సేవలందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టగా, పలు దేశాల ప్రతినిధులూ ఇక్కడికొచ్చి వీటిపై అధ్యయనం చేశారు.

ఇకపై ఆర్బీకే కేంద్రాల్లో ఇంటర్న్‌షిప్‌....

సాధారణంగా.. మెడికోలకు బోధనాస్పత్రుల్లోనూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లోనూ చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. అదేరీతిలో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులను జిల్లా కేంద్రాల్లో ఉండే డాట్‌ సెంటర్లకు, మిగిలిన వర్సిటీలు రీసెర్చ్‌ స్టేషన్, కేవీకేలకు అటాచ్‌ చేసేవారు. వాటి పరిధిలో ఓ వారం పదిరోజుల పాటు విద్యార్థులు స్టడీ చేసేవారు. ప్రస్తుతం ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షిప్‌ నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది.

ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు....

ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు, వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలలు, వెటర్నరీ విద్యార్థులకు నెలరోజుల చొప్పున ఇంటర్న్‌షి ప్‌ నిర్వహించేలా ఆయా యూనివర్సిటీ వీసీలు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 20 నుంచి నెలరోజులపాటు ఇంటర్న్‌షి ప్‌ ఉండేలా మత్స్య యూనివర్సిటీ కూడా షెడ్యూల్‌ రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో ఈ ఇంటర్న్‌షి ప్‌నకు శ్రీకారం చుట్టారు.


 

ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్‌ కార్నర్‌

ఇక ఇంటర్న్‌షి ప్‌ కోసం ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్‌ కార్నర్‌ను ఏర్పాటుచేశారు. రీసెర్చ్, ఎక్స్‌టెన్షన్‌ సెంటర్ల శాస్త్రవేత్తలతో పాటు స్థానిక అధికారులు, ఆర్బీకే సిబ్బందితో అనుసంధానం చేశారు. ప్రతీరోజు ఆర్బీకేలను విజిట్‌ చేస్తూ వాటి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించేలా షెడ్యూల్‌ రూపొందించారు. ప్రధానంగా ఇన్‌పుట్స్‌ సరఫరా, కియోస్క్‌ల పనితీరు, వాతావరణ సమాచారం, నాలెడ్జ్‌ షేరింగ్, ఈక్రాప్‌ బుకింగ్, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్, కొనుగోలు తీరు, ఆర్బీకే సిబ్బంది, బ్యాంక్‌ మిత్రల సేవలు, పశువులకు వ్యాక్సినేషన్, హెల్త్‌కార్డుల జారీ, సీహెచ్‌సీలు, పొలంబడులు, తోటబడులు, పశు విజ్ఞాన బడులు, వ్యవసాయ సలహా మండళ్ల పనితీరు, ఎఫ్‌పీఓలు, జేఎల్‌జీ గ్రూపుల పనితీరుతో పాటు పంటల బీమా, రైతుభరోసా, సున్నా వడ్డీ పంటల రుణాలు వంటి పథకాల అమలు తీరుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై విద్యార్థుల అధ్యయనాన్ని అంచనా వేస్తూ 5-10 మార్కుల వరకు ఇస్తారు.

తరగతి గదుల్లో ఆర్బీకేల గురించి..

ఈ నేపథ్యంలో.. రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్బీకేల అంశాన్ని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సీటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న వీటి గురించి తరగతి గదుల్లో బోధిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? వాటి ఆవశ్యకత, లక్ష్యాలు, వాటి ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలు, రైతుల జీవితాల్లో ఆర్బీకేలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి.. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆర్బీకేలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Rythu Bharosa Kendralu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0