Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out what foods can be fed to a cow and what amazing results can be obtained?

 ఆవు : గోమాతకు ఏయే ఆహారాలను తినిపిస్తే.. ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చో తెలుకుందాం?

Let's find out what foods can be fed to a cow and what amazing results can be obtained?

హిందూ సంప్రదాయం ప్రకారం ఆవు ఎంతో పవిత్రమైంది.. అన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఆవును హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.

గోమాతలో సకల దేవతలు ఉంటారు. కనుకనే గోమాతను పూజిస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం గోమాతకు వివిధ రకాల ఆహారాలను తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలు కలుగుతాయట. ఆవుకు ఏమేం ఆహారాలను తినిపిస్తే.. ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

  • గోమాతకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. 
  • నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. 
  • నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. 
  • గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. 
  • అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 
  • 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతాయి.
  • 5 గంటల పాటు నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. 
  • కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే దరిద్రం పోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 
  • నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. 
  • ఉడికించిన బంగాళా దుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. 
  • క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. 
  • బీట్‌రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు.
  • గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. 
  • టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుంది. 
  • వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి జరుగుతుంది. 
  • అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను అలంకరిస్తారు. 
  • బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది. 
  • గోమాతకు దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
  • ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out what foods can be fed to a cow and what amazing results can be obtained?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0