Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

From the Desk of Principal Secretary Episode 4 Highlights.

ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎపిసోడ్ 4 ముఖ్యాంశాలు .

From the Desk of Principal Secretary Episode 4 Highlights.

కార్యక్రమాల అమలులో అసౌకర్యాలు కలిగితే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి  :: గౌ౹౹ ప్రవీణ్ ప్రకాష్ గారు .

గత నాలుగు నెలలుగా పాఠశాల ల సందర్శన లో  అంశాలను మీతో పంచుకోవడం లో భాగంగా.ఈ రోజు మీతో.

పాయింట్ నెంబర్ వన్.కవరేజ్ ఆఫ్ సిలబస్.

 మీ పిల్లవాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్న ఆ పాఠశాలలో పాఠ్యాంశాలు పూర్తి కాకుండా మీ పిల్లవాడు పరీక్ష రాస్తూ ఉంటే మీరు ఎలా భావిస్తారు? పిల్లవాడు ఏ విధంగా మంచి స్కోరు సాధిస్తాడు?

 కాబట్టి మీరందరూ ఎఫ్ఏ పరీక్షగా వచ్చే ఎస్సే పరీక్ష కావచ్చు పరీక్ష జరగడానికి ముందు సిలబస్ కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.

 ఎలక్షన్ కమిషనర్  గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ సమర్థవంతంగా  నిర్వహిస్తారో.... అదే విధంగా పాఠశాలలో విద్యా రంగంలోని అన్ని స్థాయిలోనే అధికారులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి మన ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగాన్ని  విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

 గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పైన చేస్తున్నటువంటి ఖర్చు దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు చేయడానికి కూడా వెనకడం లేదు కావున ఇంత మొత్తం డబ్బు వెచ్చించడం ఆ డబ్బుని సరిపడా విధంగా ఫలితాలను కూడా మనం రాబట్టాలి.

 పాయింట్ నెంబర్ టు 

ఫ్లాట్ షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వెదర్ ఇట్ ఇస్ జగనన్న గోరుముద్ద,

 జగనన్న విద్యా కానుక ,

నాడు నేడు ఈ కార్యక్రమంలో నాణ్యత పైన ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయుని కోరారు. పాఠశాలకు సరఫరా చేయబడు జగనన్న విద్యా కానుక మరియు జగనన్న గోరుముద్దలో భాగంగా చిక్కి గుడ్డు నాణ్యతలో లోపాలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానోపాధ్యాయులు స్వీకరించరాదని అలాగే ఎలాంటి అసౌకర్యాలు పై కార్యక్రమాలు అమల్లో ఏర్పడిన వెంటనే తన వాట్స్అప్ నెంబర్ కు ఏ ఉపాధ్యాయ మిత్రుడైనా కూడా సందేశం పంపవచ్చని తెలిపారు.

  అలాగే నాడు నేడు పాఠశాలలో ఫేస్ వన్ కింద చాలా చక్కగా ఉన్న పాఠశాలలో ముఖ్యంగా మరుగుదొడ్లు మరియు త్రాగునీరు పై అధిక శ్రద్ధ వహించాలని కోరారు .

నాడు నేడు ఉన్నత పాఠశాలలో నైట్ వాచ్మెన్ నియామకానికి మొదట ప్రాధాన్యతగా ఆయా యొక్క హస్బెండ్, ను  లేనిపక్షంలో ఆ గ్రామంలోని ఎక్స్ సర్వీస్ మెన్ తరువాత ఇతరులను నియమించుకోవచ్చు అని తెలిపారు .

నాలుగవ పాయింట్ గా రాగి జావా ప్రోగ్రాం కూడా పాఠశాలల్లో తప్పకుండా అమలు చేయాలని తెలిపారు బై జ్యూస్ టాబ్లు మరియు ఇంటర్ ఆక్టివ్ పానల్స్ రాబోయే విద్యా సంవత్సరానికి 30 వేల పాఠశాలలకి ఏర్పాటు చేయబోతున్నారని రానున్న విద్యా సంవత్సరం ని ఒక డిజిటలైజేషన్ ద్వారా బోధన  చేయాలని బైజుస్ ట్యాబ్ లోని వీడియోలన్నీ ఆ సంబంధిత ఉపాధ్యాయులు ఈ వేసవి సెలవుల్లో పూర్తిగా చూసి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాబోయే విద్యా సంవత్సరంలో బోధనలో డిజిటల్ కంటెంట్ ని వినియోగించాలని కోరారు.

చివరగా రాబోయే ఫైనల్ పరీక్ష లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

*********************************

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మొదటి వీడియోలోని సందేశం.

CLICK HERE FOR IST VIDEO


గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి రెండవ వీడియోలోని సందేశం.

CLICK HERE FOR 2ND VIDEO


గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మూడవ వీడియోలోని సందేశం.

CLICK HERE FOR 3RD VIDEO



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "From the Desk of Principal Secretary Episode 4 Highlights."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0