Varanasi Ropeway: వారణాసి వీధుల్లో తీరనున్న భక్తుల ఇక్కట్లు.. త్వరలో రోప్‌వేలో ప్రయాణం.. నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన.
నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. విద్యుత్ రోప్ వే సహా 28 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన
కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇరుకైన వీధులు భక్తులకు ఇబ్బంది కలిగించవు. వారణాసి లో బయటకు వచ్చే భక్తులకు ఇక నుంచి ఇరుకైన వీధులు ఇబ్బంది కలిగించవు.
ముఖ్యంగా కాంట్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్వనాథ దేవాలయం లేదా దశాశ్వమేధ ఘాట్ వైపు వెళ్లే ప్రయాణికులు రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రయాణీకులు కొన్ని నిమిషాల్లో ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇక్కడి రోప్‌వే ప్రాజెక్టు .. భక్తుల సౌకర్యార్ధం అందుబాటులోకి రానుంది. ఈరోజు ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 644.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్ కింద.. వారణాసి కాంట్ నుండి కాశీ విద్యాపీఠం, రథయాత్ర, చర్చి గుండా గొదౌలియా కూడలి వరకు మొత్తం ఐదు స్టేషన్లు నిర్మించబడతాయి. అథారిటీ వైస్-ఛైర్మెన్ అభిషేక్ గోయల్ ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు, పర్యాటకులు వారణాసిని సందర్శించడానికి సౌకర్యంగా ఉంటుంది. అంతే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
వారణాసి సంస్కృతి
బనారస్ పాత రోడ్లు చాలా ఇరుకైనవి. నిత్యం భక్తులు, పర్యాటకులతో రద్దీగా టాయి. ఈ నేపథ్యంలో ఈ రోప్‌వే కు ప్రాముఖ్యత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కాంట్ రైల్వే స్టేషన్‌లో దిగి విశ్వనాథ ఆలయానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారుల ప్రకారం.. ఈ రోప్-వే రైడ్ కాశీని కూడా సందర్శించేలా చేస్తుంది. వాస్తవానికి, నేల స్థాయి నుండి 50 మీటర్ల ఎత్తులో నడవ నున్న ట్రాలీ కారులో కూర్చుని వారణాసి నగరాన్ని, సంస్కృతిని ప్రజలు చూడగలరు.
ప్రపంచంలోనే మూడో దేశం భారత్.
అథారిటీ వీసీ అభిషేక్ గోయల్ ప్రకారం, ఇది దేశంలో మొట్టమొదటి ప్రజా రవాణా రోప్-వే. ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఈ నగరంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. నేషనల్ హైవే లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనురాగ్ త్రిపాఠి ప్రకారం.. ఇటువంటి ప్రాజెక్ట్‌లు ఇప్పటికే లా పాజ్, బొలీవియా , మెక్సికోలో ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా రోప్‌వేను ఉపయోగించే ప్రపంచంలోనే మూడవ దేశంగా భారతదేశం నిలుస్తుందని..దేశంలో వారణాసికి ఈ ప్రత్యేకత లభిస్తుందని ఆయన అన్నారు.
ఇతర నగరాల్లోనూ రోప్ వే ఏర్పాటు చేసే అవకాశం
ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి నిర్మాణం చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. స్విస్ కంపెనీ బాథోర్లెట్, నేషనల్ హైవే లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఈ 3.8 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నాయి.
16 నిమిషాలలో ప్రయాణం
ఈ రోప్‌వే ద్వారా వారణాసి కాంట్ నుండి గొదౌలియా వరకు 3.8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు అని అనురాగ్ త్రిపాఠి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కింద, మొత్తం 150 ట్రాలీ కార్లు నేల మట్టం నుండి దాదాపు 50 మీటర్ల ఎత్తులో రెండు నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ఈ ట్రాలీ ప్రయాణంలో ఒక్కొక్క ట్రాలీలో 10 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. వివరాల ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం.. ఈ రోప్‌వే ద్వారా, ప్రతి గంటకు కనీసం 3000 మంది ప్రయాణికులు ఒక వైపు నుండి గమ్యస్థానానికి చేరుకోగలరు.
0 Response to "Varanasi Ropeway"
Post a Comment