Ramzan Date 2023
Ramzan Date 2023: రంజాన్ తేదీ ఫిక్స్, ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం, నెలవంక కనిపించకపోవడంతో ప్రకటించిన ముస్లిం మతపెద్దలు.
ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు.
ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. అయితే రంజాన్ మాసం ప్రారంభం ముస్లీంల పరమ పవిత్ర మసీదైన మక్కాపై చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రంజాన్ మాసం మార్చి 24న ప్రారంభమై ఏప్రిల్ 24న ఈద్-ఉల్-ఫితర్ రోజున ముగుస్తుందని భావిస్తున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను (Ramadan 2023 Date) బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు
ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇది ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఉపవాస సమయంలో ప్రజలు సెహ్రీ, ఇఫ్తార్ చేస్తారు. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సూర్యోదయానికి ముందు తీసుకునే భోజనాన్ని సెహ్రీ అని, సూర్యోదయం తర్వాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు. పవిత్ర రంజాన్ మాసంలో, ఉపవాసం ఉండే వ్యక్తి సరైన సమయంలో సెహ్రీ, ఇఫ్తార్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. సెహ్రీ తర్వాత, రోజంతా ఏదైనా తినడం, త్రాగడం నిషేధించబడింది. సాయంత్రం నమాజ్ చేసిన తర్వాత, సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్ చేస్తారు.
రంజాన్ మార్చి 24 నుండి ప్రారంభమవుతోంది, మొదటి ఉపవాసం కోసం సెహ్రీ సమయం ఉదయం 4:38, ఇఫ్తార్ సమయం సాయంత్రం 6:20 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే, సెహ్రీ, ఇఫ్తార్ సమయాలు పలు నగరాల్లో భిన్నంగా ఉంటాయి. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. స్థానిక సంప్రదాయం ప్రకారం, మధ్యప్రాచ్య దేశాలు రంజాన్ , ఈద్-ఉల్-ఫితర్ రెండింటినీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఒకరోజు ముందుగానే జరుపుకుంటాయి. దుబాయ్, అబుదాబిలో, రంజాన్ మార్చి 23 న ప్రారంభమవుతుంది, ఇండోనేషియాలో ఇది మార్చి 22 న ప్రారంభమవుతుంది మరియు కువైట్, లెబనాన్, మాల్దీవులు, మొరాకో, ఖతార్, సౌదీ అరేబియా, ట్యునీషియా ,టర్కీలలో కూడా మార్చి 23 న రంజాన్ నెల ప్రారంభమవుతుంది. చంద్రుని దర్శనాన్ని బట్టి ప్రతి దేశం ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనుంది.
0 Response to "Ramzan Date 2023"
Post a Comment