Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AAICLAS Recruitment 2023

Airport Jobs: ఎయిర్‌పోర్ట్ కార్గోలో 400 ఉద్యోగాలు. డిగ్రీ పాసైతే చాలు.

డిగ్రీ పాసైనవారికి అలర్ట్. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) విడుదలైంది.

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్ని (Security Screener Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. భారతదేశంలో వేర్వేరు చోట్ల ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టింగ్ ఎక్కడ లభిస్తుందన్నది కంపెనీ నిర్ణయిస్తుంది.

ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇవి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు . కాంట్రాక్ట్ గడువు మూడేళ్లు ఉంటుంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. 2023 మార్చి 19 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‍కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోగలరు.

 AAICLAS Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

భర్తీ చేసే పోస్ట్ పేరు- సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్)

దరఖాస్తు ప్రారంభం-  08.03.2023

దరఖాస్తుకు చివరి తేదీ- 19.03.2023

ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్

విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ కావాలి.

వయస్సు- 2023 మార్చి 19 నాటికి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు ఫీజు లేదు.

వేతనం- మొదట నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేసినవారికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

  అప్లై చేయు విధానం

  • Step 1- అభ్యర్థులు ముందుగా AAICLAS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
  • Step 2- ఆ తర్వాత సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
  • Step 3- అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌, బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • Step 4- లాగిన్ చేసిన తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
  • Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

 

WEBSITE : https://aaiclas.aero/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AAICLAS Recruitment 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0