Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Powers of Enforcement Directorate

 ఈడీ అధికారాలేంటి ?., సెక్షన్- 50 ఏం చెబుతుంది ? అసలు ఏంటో తెలుసుకుందాం.

Powers of Enforcement Directorate

Powers of Enforcement Directorate: CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి ఈడీ విచారణ కొనసాగిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు.. ఏం చేస్తావో చేసుకో.. ఏ కేసులకు భయపడేది లేదు అంటుంటారు. అలాంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయడం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే... ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ వణికిపోతుంటారు. CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి..? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ సవివరంగా తెలుసుకుందాం.

ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..! ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పని చేస్తుంది.

1. FEMA..

2. PMLA._ 

ఫెమా (FEMA) అంటే Foregin Exchange Management Act-1999. ఇది సివిల్ చట్టం. FEMAలో ఫారెన్ ఎక్సేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు.

PMLA అంటే prevention oF money Laundering Act-2002. ఇది క్రిమినల్ చట్టం.  ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి.. చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని.. ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ.

 PMLA ప్రకారం ఈడీకి 3 సూపర్ పవర్స్ ఉన్నాయి.

నెం-1: కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్ లో నైనా రైడ్స్ చేయవచ్చు.

నెం-2: CBI గానీ, ఇతర పోలీసులు డిపార్ట్ మెంట్స్ గానీ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. కానీ.. ఇండియన్ evidence ACT ప్రకారం.. ఆ స్టేట్ మెంట్స్ లను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే.. నిందితులు చెప్పిన స్టేట్ మెంట్ కు మళ్లీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి. ఈడీకి అలా కాదు. PMLA సెక్షన్ 50 అండర్2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఐన రికార్డు చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారనుకోండి. మళ్లీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు.

నెం-3:సాధారణంగా చట్టం ఏం చెబుతోంది... నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు..! అంటే ఉదాహరణకు నవీన్ అనే వ్యక్తి ఒకరిని హత్య చేశాడు అని కేసు నమోదు చేస్తే..,పోలీసులు, ప్రాసిక్యూషన్ అది నవీనే చంపాడు అని సాక్ష్యాలన్ని కోర్టు ముందు పెట్టేవరకు..,నవీన్ అమాయకుడే. ఆ సాక్ష్యాలు సంపాదించడానికి పోలీసులకు నానా ఇబ్బందులు ఉంటాయి.,కానీ.. ఈడీలో అలా కాదు. రివర్స్ లో ఉంటుంది.,మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషే.!ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అక్రమంగా 10 కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయనుకోండి..,రమేష్ నా దగ్గర 5 కోట్లే ఉన్నాయి.,అవి కూడా సక్రమంగా సంపాదించాను అని తనే నిరూపించుకోవాలి.,లేకపోతే.,తప్పు చేసినట్లే లెక్క. ఇక్కడ తాను నిర్దోషి అని నిరూపించుకనే బాధ్యత.,బరువు రమేష్ పైనే ఉంటుంది.,ఈడీ అధికారులపై అనవసర టెన్షన్ ఉండదు.,ఈడీ మోపే ఆరోపణలకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకలోకి వస్తుంది. అందుకే.. ఈడీ కేసులంటే నేతలతో పాటు ఇతర.,రంగాలకు చెందిన సెలబ్రిటలు సైతం భయపడుతుంటారు..,ఈ సూపర్ పవర్స్ వల్లే ఈడీ కేసులంటే భయపడిపోతుంటారు. అందుకే.. ఈ మధ్య కాలంలో CBI కంటే ఈడీ పైనే నజర్ ఎక్కువైంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Powers of Enforcement Directorate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0