Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you putting too much money in the house? Do you know what happens?

ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసుకుందాం.

Are you putting too much money in the house? Do you know what happens?

దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు.

ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు.

అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్‌లు, ఆధార్‌, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి.

ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you putting too much money in the house? Do you know what happens?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0