Child Care Leave Queries - Answers
చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు- సమాధానాలు.
ప్ర: ఛైల్డ్ కేర్ లీవు 60 రోజులు క్రొత్త G.O రాకముందు 8 Spells లో వాడుకొన్నాను.
G.O 199 dt 19.10.2022 ప్రకారము ఈ సెలవును 180 రోజులకు పెంచారు కదా?
మిగిలిన120 రోజులు నేను మిగిలి 2Spells లోనే వాడుకోవాలా లేక ఎక్కువ Spells లో వాడుకోవచ్చా?
జ:G.O 199 dt 19.10.2022 లోని చివరి పేరా లోని వివరణ ప్రకారముఈ G.O ఇచ్చిన తేదీ నుండి 180 రోజులు 10 Spells లో వాడుకొనవచ్చును.
మీరు మిగిలిన120 రోజులు 10 Spells లో
(గరిష్టంగా18ఏళ్ళ లోపు ఇద్దరు పిల్లలకు) వాడు కొనవచ్చును.పాత 60 రోజులు ఎన్ని Spells లో వాడుకొన్నరో పరిగణన లోకి తీసుకొనకూడదు..
ప్ర: Minimum Time Scale లో పని చేసే టీచర్లు child care leave ను వాడుకొనవచ్చునా?
జ:ఈ సదుపాయము కేవలం ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు మాత్రమే MTS వారికి ఈ సదుపాయము వర్తింప చేయవలసి ఉన్నది.
అయితే MTS మహిళా టీచర్లకు 180 రో ప్రసూతి సెలవు ఉపయోగించుకొనే అవకాశము ఉన్నది..
ప్ర:Fin dept వారు మార్చి 13 వ తేదీన మెమో ద్వారా విడుదల చేసిన Dept&Post wise Scales కు Sri Asuthosh misra గారు ఇచ్చిన Report లోని Scales కు కొన్ని Posts కు తేడావచ్చనది. ఏవి Correct?
జ: నిజమే.
ఉదాహరణలు
SGTతత్సామాన కేడర్ వారికి వారికి 11 th PRC రిపోర్టులో
32670-101970 సిఫార్సు చేయగా ఆర్ధిక శాఖ
34580-107210 గానిర్ణయించినది.
అలాగే Senior Asst కు 37640-11550 కు బదులుగా
34580-107210
Junior Asst కు 28280-89720 కు బదులుగా 25220-80910 ను నిర్ణయించి 11 వ PRC లో ఉత్తర్వులు విడుదల చేసినది.G O No 1 dt 17.1.2022 లో ఇచ్చిన Schedule నే ప్రామాణికంగా తీసుకొని మెమో లో Dept wise Scales నిర్ణయించినది. ఇలాగే IASE కాలేజ్ Lecturers ,Diet lecturers,ASO,Additional Director కేడర్ లో వారికి కూడా11 th PRC Report కు భిన్నంగా Scales నిర్ణయిం చబడినవి.
ప్ర: ఉద్యోగుల IT e filing ఎవరి బాధ్యత?DDO దా? Employee దా?
జ:Employee దే.
ప్ర: ఉద్యోగి Willing లేకుండా ప్రతి నెలా జీతం లో IT క్రింద కొంత మొత్తమును TDS గా DDO మినహాయించవచ్చా?
జ: గత ఆర్ధిక సం చెల్లించిన IT ఆధారంగా ఎంత మొత్తము జనవరి 2024 వరకు TDS గా మినహాయిస్తున్నామో ఒక Order ద్వారా DDO కేవలం తెలియ పరచటం వరకే బాధ్యత.ఉద్యోగి Willing అవసరం లేదు.అలా మినహాయించక పోతే IT వారు DDO కు పెనాల్టి విధిస్తారు.
0 Response to "Child Care Leave Queries - Answers"
Post a Comment