Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you think that the country is afraid of Corona, Corona has not left yet! Extreme Depression and Heart Disease.. Shocking Facts in Research.

 COVID-19: కరోనా నుండి దేశం భయటపడింది అనుకుంటుంటే ఇంకా వదలని కరోనా! విపరీతమైన డిప్రెషన్ మరియు గుండె జబ్బులు.పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు.

If you think that the country is afraid of Corona, Corona has not left yet!  Extreme Depression and Heart Disease.. Shocking Facts in Research.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేసింది. వేలాది మంది ప్రాణాలను హరించింది. లక్షలాది మందిని ఆస్పత్రుల పాల్జేసింది. అన్ని రంగాలను కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది.

నెమ్మదిగా ఈ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడుతోంది. ఇదంతా ఒకవైపు అయితే.. కరోనా వైరస్ అనేది మనిషిని మానసికంగా కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు.

పరిశోధన ఇలా.

కోవిడ్ 19 సమయంలో మనిషి మానసిక స్థితిపై పరిశోధకులు ఓ అధ్యయనాన్ని చేశారు. దాదాపు 136,000 మంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా విజృంభించిన సమయంలో మనిషిలో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు గణనీయంగా పెరిగాయని కనుగొన్నారు. రోగులలో సగానికి పైగా డిప్రెషన్‌లో ఉన్నట్లు నివేదించారు. ఇది గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చని అభిప్రాయ పడ్డారు. వీరిలో డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కోసం రోగులను పరీక్షించడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ మానసిక ఆరోగ్య సమస్యలు అధిక రక్తపోటు, జీవక్రియ వ్యాధి, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

రోగుల ఫీడ్ బ్యాక్ ఇలా.

డిప్రెషన్ లక్షణాలు కరోనా పాజిటివ్ రోగులలోనూ, అలాగే సాధారణ ప్రజలలోనూ అదే విధంగా ఉన్నాయిని ఈ పరిశోధన నిర్ధారించింది. పరిశోధనకులు రోగులలోని డిప్రెషన్ ను స్క్రీన్ చేయడానికి ఫస్ట్ పేషంట్ హెల్త్ కేర్ క్వషనరీ-9(పీహెచ్-9) అనే దానిని నిర్వహించారు. దీనిలో కొన్ని ప్రశ్నలు రోగులకు అడిగి సమాధానాలు రాయించారు. ఈ ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబులను విశ్లేషించిన పరిశోధకులు.. వారి డిప్రెషన్ స్థాయిలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ ప్రశ్న పత్రంలో (<10) స్కోర్ వస్తే డిప్రెషన్ అస్సలు లేదని.. 10-14 వస్తే మైల్డ్.. 15-19 వస్తే మోడరేట్ అని.. (>20) వస్తే సివియర్ అని విభాగించారు. మొత్తం మీద దాదాపు 45శాతం మంది రోగుల్లో కరోనా ప్రారంభ సమయంలో కొంత మేర డిప్రెషన్ ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఇది 2021కి వచ్చేసరికి 55 శాతానికి పెరిగింది. దీనిలో కరోనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం.

భవిష్యత్తులో ఇబ్బందులు

డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, పీఎస్టీడీ, అధిక రక్తపోటు, అధిక స్థాయి కార్టిసాల్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది ధమనులలో కాల్షియం ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండె జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you think that the country is afraid of Corona, Corona has not left yet! Extreme Depression and Heart Disease.. Shocking Facts in Research."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0