Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

US visa

 US visa: స్టుడెంట్ వీసాలపై అమెరికా కీలక ప్రకటన.

US visa

US visa: పలు కేటగిరీలకు చెందిన వివిధ దేశాల విద్యార్థుల వర్క్ ఆథరైజేషన్ దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ను ప్రారంభిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఈ నిర్ణయం వల్ల వేలాది భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (science, technology, engineering and mathematics - STEM) సబ్జెక్టుల్లో ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరం కానుంది. 

optional practical training: ఓపీటీ ఇక మరింత ఈజీ

STEM సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (optional practical training OPT) పొడగింపు దరఖాస్తులను మార్చి 6వ తేదీ నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ కు అనుమతిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (US Citizenship and Immigration Services USCIS) ప్రకటించింది. మరికొన్ని ఇతర విభాగాల ప్రీమియం ప్రాసెసింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ ఫిల్లింగ్ ఫెసిలిటీ USCIS వెబ్ సైట్లో అందుబాటులో ఉందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జాదౌ తెలిపారు. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. స్టెమ్ సహా వివిధ కేటగిరీల ఎఫ్ 1 వీసా (F-1) విద్యార్థుల ఓపీటీ పొడగింపు దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ కు అమెరికా తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

premium processing: ఆన్ లైన్ ప్రొసీజర్ ఇదే.

ప్రీమియం ప్రాసెసింగ్ ను అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకునే ఐ 907 (I-907) ఆన్ లైన్ ఫిలింగ్ ప్రొసీజర్ ఇప్పుడు స్టెమ్ సహా పలు కేటగిరీల ఎఫ్ 1 (F-1) విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఓపీటీ అనుమతులు పొందడంలో నెలకొంటున్న జాప్యం ఈ నిర్ణయంతో తొలగిపోతుందని భావిస్తున్నారు. I-765 ఫామ్ పెండింగ్ లో ఉన్న ఎఫ్ 1 స్టుడెంట్స్ కూడా ఇప్పుడు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఐ 907 ఫామ్స్ ను USCIS కి పంపించవచ్చు. అలాగే, స్టెమ్ సహా పలు కేటగిరీల విద్యార్థులు ఏప్రిల్ 3 నుంచి I-765 ఫామ్, I-907 ఫామ్ లను ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీటీ అప్రూవల్స్ త్వరితగతిన లభిస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "US visa"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0