Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Relaxation for the disabled in ten exams

 పది పరీక్షల్లో దివ్యాంగులకు సడలింపులు

Relaxation for the disabled in ten exams

  • వెసులుబాట్లు ఇవీ.
  • కొందరికి ఒకటి నుండి రెండు సబ్జెక్టులు మినహాయింపు
  • మరికొందరికి కనీస ఉత్తీర్ణత మార్కుల కుదింపు

ఈ.ఏడాది ఏప్రిల్లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పలు సడలింపులు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. కొందరికి సబ్జెక్టు మినహాయింపులు ఇచ్చింది. లాంగ్వేజీలలో ఒకటి నుంచి రెండు, మరికొందరికి కనీస ఉత్తీర్ణత మార్కులు కుదించింది. జనరల్ విద్యార్థులకు మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా దివ్యాంగుల్లో కొందరికి 400 మార్కులు, మరికొందరికి 500కు ఉంటుంది. కనీస ఉత్తీర్ణత మార్కుల్లో 10 నుంచి 25 మార్కుల వరకూ రాయితీ ఇచ్చారు.

వెసులుబాట్లు ఇవీ..

  • కుష్ఠు వ్యాధి నమోదైన వారు మరుగుజ్జుతనం, మస్కులర్ డిస్టోఫి, యాసిడ్ దాడి బాధితులకు 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి ఒక లాంగ్వేజీ మినహాయింపుతోపాటు ప్రతి సబ్జెక్ట్ లో కనీసం 10 మార్కులు ఉత్తీర్ణతగా ప్రకటించారు.
  • అంధత్వం ఉన్న వారికి కూడా 500 మార్కులకే పరీక్ష ఉంటుంది. వీరికి కూడా ఒక లాంగ్వేజ్ మినహాయింపుతో పాటు ఒక్కో సబ్జెక్టులో కనీస ఉత్తీర్ణత మార్కులు 20గా ప్రకటించారు.
  • చెయ్యి, కాలు శాశ్వత అంగవైకల్యం ఉన్నవారు, వెన్నుపూస పనిచేయని వారు, నరాల బలహీనతతో అంగవైకల్యం, కాళ్లు మెలికలు తిరిగి ఉన్నవారు, వెన్నుపూస గాయాలు, చూపు మందగించిన వారికి 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక లాంగ్వేజీకి మినహాయింపు ఇచ్చారు. వీరు జనరల్ విద్యార్థులతోపాటు హిందీలో 20, ఇతర సబ్జెక్టుల్లో
  • కనీసం 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు. వినికిడి లోపం ఉన్నవారికి 400 మార్కులకే పరీక్ష నిర్వహిస్తారు. రెండు లాంగ్వేజీలకు మినహాయింపు ఇచ్చారు. వీరు ఒక్కో సబ్జెక్టులో కనీసం 20 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులు అయినట్లే.
  • మాట్లాడలేకపోవడం, భాషా వైకల్యం ఉన్నవారికి 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వీరు ఒక్కో సబ్జెక్టులో కనీసం 20 మార్కులు సాధిస్తే పాసైనట్లే.
  • ప్రత్యేక అభ్యసన వైకల్యం, డైవెక్సియా, డిస్క్గ్రాఫియా, డిస్ ప్రామియా, డెవలప్మెంట్ అపోసియా వారికి 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వీరికి ఇంగ్లీషు పరీక్ష మినహాయింపు ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో 15 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే.
  • ఇంటెలెక్చువల్ డిజెబిలిటీ, మెంటల్ ఇల్నెస్ వారికి 600 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో కనీసం 10 మార్కులు సాధిస్తే పాసైనట్లే.
  • దీర్ఘకాలిక నరాల బలహీనతకు సంబంధించి మల్టిపుల్ సెలిరిసిస్, పార్కిన్ డిసీజ్, హిమోఫీలియా, తలసేమియాతో బాధపడు తున్న వారు 500 మార్కు లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. వీరు జనరల్ విద్యార్థుల తరహాలోనే కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించా లి. వీరికి ఇంగ్లీషు పరీక్ష మినహాయిం పు ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Relaxation for the disabled in ten exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0