Watermelon: Find out what's good and what's not when buying watermelon.
Watermelon: పుచ్చకాయను కొనేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఇలా కనిపెట్టేయండి.

- పుచ్చకాయలో ఆడ, మగ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. తియ్యటి కాయ కావాలంటే… పొడవుగా ఉన్న కాయ కన్నా గుండ్రం వున్నా కాయను ఎన్నుకోండి.
- కాయ అడుగు భాగం చూడండి.. అక్కడ పసుపు రంగు ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట
- తొడిమను చూడండి.. అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు. (తొడిమ పచ్చగా ఉంటే.. ఆ కాయ తీసుకోకండి )
- తొడిమకు అటువైపు ఎండ్‌లో అంటే.. పువ్వు వచ్చే వద్ద.. మచ్చలు ఉంటే దాని పైన ఎక్కువ తేనెతీగలు వాళ్లినట్టు లెక్క. అంటే పోలీనేషన్ ఎక్కువ జరిగినట్టు.. అది చాలా స్వీట్‌గా ఉంటుంది.
- కంప్లీట్‌గా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి.
- పుచ్చకాయను కొనేముందు దానిపై వేళ్లతో కొట్టినప్పుడు టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పొచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం.
- పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. మరి తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ ముదర పండి.. మురిగిపోయేందుకు దగ్గరలో ఉందని అర్థం.
0 Response to "Watermelon: Find out what's good and what's not when buying watermelon."
Post a Comment