Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Group - 1 , Group - 2 Jobs

APPSC Group - 1 , Group - 2 Jobs : ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త . త్వరలో గ్రూప్ -1 , 2 నోటిఫికేషన్లు మరియు ఖాళీల వివరాలు.

త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ సర్కార్ కసరత్తును ముమ్మరం చేసింది.

ఈ మేరకు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం.. గ్రూప్-1 పోస్టులు 140, గ్రూప్-2 పోస్టులు అత్యధికంగా 1082 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం 12 శాఖల్లో గ్రూప్-1 పోస్టులు, హెచ్ఓడీలతో పాటు మరో 10 విభాగాల్లో గ్రూప్-2 ఖాళీలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

గ్రూప్-1 ఉద్యోగాల్లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, సీటీఓ, ఆర్డీఓ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషన్లు. ఎంపీడీఓ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంకా గ్రూప్-2లో సబ్ రిజిస్టార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ట్రెజరీ తదితర పోస్టులు ఉన్నాయి.

ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Group - 1 , Group - 2 Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0