Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Find Your Phone | If your cell phone is lost, it can be taken care of

 Find Your Phone మీ సెల్ ఫోన్ పోయిందా ఇక ఇట్టే పట్టేయవచ్చు.

Find Your Phone | If your cell phone is lost, it can be taken care of

Find Your Phone  కొంతకాలంగా సెల్‌ఫోన్ల చోరీలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్‌ కంటే అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్‌, రాజకీయం ఇలా ప్రతి సమాచారాన్ని సెల్‌ఫోన్‌ నుంచే నిర్వహిస్తున్నారు.

Find Your Phone  కొంతకాలంగా సెల్‌ఫోన్ల చోరీలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్‌ కంటే అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్‌, రాజకీయం ఇలా ప్రతి సమాచారాన్ని సెల్‌ఫోన్‌ నుంచే నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత డేటా వినియోగం పెరిగింది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ముమ్మరంగా పెరిగింది. ఈ క్రమంలో తమ వ్యక్తిగత, ఆఫీస్‌ల సమాచారాన్ని సాఫ్ట్‌ కాపీల రూపంలో సెల్‌ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారు. ఒకమాటలో చెప్పాలంటే దైవందిన జీవితంలో ఫోన్‌ కీలకంగా మారింది. అంతటి కీలకమైన ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా పరిస్థితి ఏంటి? అంతటి కీలకమైన స్మార్ట్‌ఫోన్‌ పోయినా.. పోగొట్టుకున్నా.. అందులో డేటా చోరీకి గురైనా పలు సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై అలాంటి చికులు లేకుండా రాష్ట్ర పోలీస్‌ శాఖ వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ విధానంపై మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్‌ఫోన్‌ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్‌ఫోన్‌పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నా సెల్‌ఫోన్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ లేనిదే పని కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌ పోతే.. దాన్ని ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CEIR ప్రత్యేక అప్లికేషన్‌ ద్వారా సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రత్యేక యాప్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
సీఈఐఆర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో..

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన CEIR(CENTRAL EQUIPMENT IDENTITY REGISTER) సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను తిరిగి కనిపెట్టే సాంకేతికతను పరిచయం చేస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించి సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి బ్లాక్‌ చేయవచ్చు. సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబర్‌ సాయంతో బ్లాక్‌ చేయవచ్చు. ఆ తరువాత ఆ సెల్‌ఫోన్‌ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఒకవేళ ఫోన్‌ ఆన్‌చేసి అందులో సిమ్‌ తీసి కొత్త సిమ్‌ వేసినా ఆ విషయం ఫోన్‌ యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిసిపోతుంది.

ఎలా పని చేస్తుంది.?

  • సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో బ్లాక్‌ ఫోన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మొబైల్‌ నంబర్‌-1, మొబైల్‌ నంబర్‌-2, ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌, ఇన్వాయిస్‌(బిల్‌)ఫొటో సూచించిన గడుల్లో నింపాలి.
  • పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామాలు, అంతకుముందే ఇచ్చిన పోలీస్‌ కంప్లయింట్‌ నంబర్‌, ఫోన్‌ యజమాని చిరునామా, ఈ మెయిల్‌ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చాప్టర్లను సూచించిన బాక్సుల్లో నింపాలి.
  • వెంటనే మీ సెల్‌ఫోన్‌ పాత నంబర్‌ మీద తీసుకున్న కొత్త సిమ్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత ఫామ్‌ను సబ్‌మిట్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ దానంతట అదే బ్లాక్‌ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్‌ చేయలేరు. దాంట్లోనే డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్‌ దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్‌ వేయగానే మీ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.
  • ఆ సందేశం ఆధారంగా ఫోన్‌ ఎకడ ఉన్నా పట్టుకోవడం సులభతరం అవుతుంది.

అన్‌బ్లాక్‌ చేయు విధానం

మీ సెల్‌ఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీ, ఫోన్‌ నంబర్‌, ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోను ఆన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు.

బ్లాక్‌ చేయు విధానం

  • మీరు సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ లేదా ఓఎల్‌ఎక్స్‌ తదితర వెబ్‌సైట్‌లో లేదా తెలిసిన వారి దగ్గర ఫోన్‌ కొనాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా లేదా బ్లాక్‌లిస్టులో ఉందా? అనే విషయం మనం కేవైఎం(నో యువర్‌ మొబైల్‌) విధానంలో ముందే తెలుసుకోవచ్చు.
  • ఇందుకోసం మొబైల్‌ తీసుకుని కేవైఎం విధానంలోనూ ఐఎంఈఐ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అందుకోసం కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్‌ చేయాలి. అనంతరం 15 అక్షరాల ఐఏఈఐ నంబర్‌ను టైప్‌ చేసి 14422 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి.
  • ఇందుకోసం కేవైఎం యాప్‌ను సైతం డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌ , ఐఓఎస్‌ మొబైల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. లేదా సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లోనూ ఆఖరిగా ఇచ్చిన ఆప్షన్‌ ద్వారా కూడా ఫోన్‌ను తనిఖీ చేసుకోవచ్చు.

ఐఎంఈఐ నంబర్‌ తెలియకపోతే..

ఒకవేళ మీరు ఫోన్‌ పోగొట్టుకున్నారు. ఐఎంఈఐ నంబర్‌ తెలియకపోయినా/గుర్తు లేకపోయినా దాన్ని ఎలా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి *#06# డయల్‌ చేయగానే మీ మొబైల్‌ నంబర్‌పై దాని ఐఎంఈఐ నంబర్‌ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఫోన్‌ పోగొట్టుకుంటే ఫోన్‌ కొన్న బాక్స్‌ మీద లేదా కొనుగోలు చేసిన షాపులో ఉన్న ఇన్‌వాయిస్‌ బిల్లు ద్వారా కూడా ఐఎంఈఐ నంబర్‌ను పొందవచ్చు.

ఆందోళన అవసరం లేదు

ప్రస్తుత జీవన శైలిలో మొబైల్‌ అత్యంత కీలకమైన పరికరం అయ్యింది. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, దరఖాస్తు చేసుకోవాలన్నా, మొబైల్‌ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా అందులో ఉన్న డేటా ఎక్కడ పోతుందోననే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇక నుంచి ఆ భయం అవసరం లేదు. ప్రభు6త్వం కొత్తగా తీసుకురాన్నున్న CEIR అనే అప్లికేషన్‌ ద్వారా ఫోన్‌ ఎకడైనా పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా దానిని ఇట్టే గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీపై ఇప్పటికే అన్ని స్టేషన్ల రైటర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనిపై సెల్‌ఫోన్‌ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇకపై మొబైల్‌ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Find Your Phone | If your cell phone is lost, it can be taken care of"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0